ప్రజావాణిలో 55 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణిలో 55 ఫిర్యాదులు

May 5 2026 6:50 AM | Updated on May 5 2026 6:50 AM

మోదీ సభా వేదిక వద్ద భూమి పూజ

లక్డీకాపూల్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి వినతిపత్రాలు సమర్పించారు. నగరంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ప్రజలు 36 వినతిపత్రాలు అందజేశారు. జోన్‌ వారీగా అందిన ఫిర్యాదుల్లో శంషాబాద్‌ జోన్‌లో 2, రాజేంద్రనగర్‌ జోన్‌లో 6, చార్మినార్‌ జోన్‌లో 3, ఖైరతాబాద్‌ జోన్‌లో 2, సికింద్రాబాద్‌ జోన్‌లో 6 ఫిర్యాదులు అందాయి. మొత్తం 55 ఫిర్యాదులు ప్రజావాణి కార్యక్రమంలో అందినట్లు అధికారులు తెలిపారు.

రాంగోపాల్‌పెట్‌: సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఈ నెల 10న ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభా వేదిక వద్ద సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. ఎంపీలు డా.కె.లక్ష్మణ్‌, ఈటల రాజేందర్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ ఇంచార్జి అభయ్‌ పాటిల్‌ పాల్గొన్నారు. మూడోసారి ప్రధాని అయ్యాక మోదీ తొలిసారి తెలంగాణకు వస్తున్నారని, సభకు 2 లక్షలమందిపైగా హాజరవుతారని రాంచందర్‌రావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement