జడ్సీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

జడ్సీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం

May 5 2026 6:50 AM | Updated on May 5 2026 6:50 AM

గచ్చిబౌలి: శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌ చాంబర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు అంటుకోవడంతో ల్యాప్‌ టాప్‌తో పాటు ఫర్నిచర్‌ దగ్ధమైంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం. సెలవు దినం కావడంతో కార్యాయలంలో ఎవరు లేరు. హై వోల్టేజీతో రివర్స్‌ విద్యుత్‌ సరఫరా కావడంతో ఈఈ చాంబర్‌ పక్కనే ఉన్న కేబుల్స్‌ కాలిపోయాయి. అక్కడి నుంచి రెండో అంతస్తులో జడ్సీ చాంబర్‌లో మంటలు చెలరేగాయి. ల్యాప్‌ టాప్‌, ఫర్నీచర్‌, విద్యుత్‌ లైట్లు, ఫ్లోర్‌ పూర్తిగా కాలిపోయింది. దీంతో జడ్సీ అమిత్‌ కాన్ఫరెన్స్‌ హల్‌లోనే సోమవారం విధులు నిర్వహించారు.ఇదిలా ఉండగా హై వోల్టేజీ కారణంగా శేరిలింగంపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలోను కేబుల్స్‌ కాలిపోయినట్లు తహసిల్దార్‌ మహిపాల్‌ రెడ్డి తెలిపారు. ఎంఈఓ కార్యాలయం బయట కూడా కొన్ని విద్యుత్‌ వైర్లు కాలిపోయాయయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement