పట్టాల కింద పైప్‌లైన్‌ లీక్‌ | - | Sakshi
Sakshi News home page

పట్టాల కింద పైప్‌లైన్‌ లీక్‌

May 1 2026 5:51 AM | Updated on May 1 2026 5:51 AM

అప్రమత్తమైన అధికారులు

యుద్ధప్రాతిపదికన పనులు

సాక్షి, సిటీబ్యూరో: మల్కాజిగిరి సర్కిల్‌ మిర్జాలగూడ వార్డు పరిధి దయానంద్‌ నగర్‌ రైల్వే ట్రాక్‌ కింద భారీ నీటి లీకేజీ గమనించిన రైల్వే అధికారులు జల మండలికి సమాచారం ఇచ్చారు. దీంతో జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి ఆదేశాల మేరకు యంత్రాంగం గురువారం యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టింది. సరఫరా సమయంలోనే లీకేజీ బయటపడడంతో ప్రధాన పైప్‌లైన్‌ నుంచే జరుగుతోందని నిర్ధారించారు. లీకేజీ కొనసాగితే ట్రాక్‌ దెబ్బతినొచ్చని భావించి మరమ్మతులు పూర్తయ్యే వరకు సరఫరా నిలిపివేశారు. రైల్వే పరిధి వెలుపల రిసెప్షన్‌ పిట్‌ వద్ద తవ్వకాలు చేపట్టగా, 20 అడుగుల లోతులో 300 మి.మీ. ఎంఎస్‌ క్యారియర్‌ పైప్‌, 800 మి.మీ. కేసింగ్‌ పైప్‌ అమర్చినట్లు గుర్తించారు. భారీ ట్రస్ట్‌ బ్లాక్‌ ఉండడంతో పనులు క్లిష్టంగా మారాయి. అందుకని జేసీబీ, ఎయిర్‌ కంప్రెషర్లు, డీ–వాటరింగ్‌ పంపులు వాడుతూ పనులు చేపడుతున్నారు.

కొత్త పైప్‌లైన్‌ ఏర్పాటు

ప్రస్తుత 300 మి.మీ. ఎంఎస్‌ పైప్‌లైనన్‌ను పూర్తిగా తొలగించి కొత్తది ఏర్పాటు చేయడమే శాశ్వత పరిష్కారం అ జలమండలి అధికారులు నిర్ణయించారు. రూ.48 లక్షల వ్యయం అంచనా వేశారు. మరమ్మతులతో వాణీనగర్‌, భవానీనగర్‌కు సరఫరా అంతరాయం కలిగింది. దీంతో జలమండలి పలు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. వాణీనగర్‌లో దాదాపు 200 కనెక్షన్లకు పాక్షికంగా సరఫరాను పునరుద్ధరించారు. మిగతా ప్రాంతాలకు ఉచిత ట్యాంకర్‌లు పంపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement