తండ్రి కాలేయంతో బాలుడికి ప్రాణం | - | Sakshi
Sakshi News home page

తండ్రి కాలేయంతో బాలుడికి ప్రాణం

May 1 2026 5:51 AM | Updated on May 1 2026 5:51 AM

అఫ్జల్‌గంజ్‌: ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రి వైద్యులు రెండేళ్ల బాలుడికి అరుదైన శస్త్ర చికిత్స చేశారు. ఉడంగడ్డ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ఇర్ఫాన్‌ రెండేళ్ల కుమారుడు మహ్మద్‌ అఫాన్‌ కండరాల బలహీనతతో తరచూ అనారోగ్యానికి గురయ్యేవాడు. దీంతో తల్లిదండ్రులు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి బాలుడు కాలేయసంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని గుర్తించారు. కాలేయదానం చేయడానికి తండ్రి అంగీకరించడంతో అతని నుండి 240 గ్రాముల కాలేయాన్ని సేకరించి దాదాపు 14 గంటల పాటు శ్రమించి బాలుడికి విజయవంతంగా అమర్చారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో సుమారు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఖర్చు అయ్యే ఇలాంటి శస్త్ర చికిత్సను ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి ఉచితంగా నిర్వహించామని.. దాదాపు లక్షమందిలో ఒకరికి ఇలాంటి అరుదైన వ్యాధి ఉండే అవకాశం ఉంటుందని ఆసుపత్రి సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్‌ మధుసూదన్‌ తెలిపారు. వైద్యుల కృషిని మంత్రి మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement