పని చేస్తున్న చోటే దొంగతనం | - | Sakshi
Sakshi News home page

పని చేస్తున్న చోటే దొంగతనం

May 1 2026 5:51 AM | Updated on May 1 2026 5:51 AM

మియాపూర్‌ : భవన నిర్మాణంలో పనిచేస్తున్న ఓ వ్యక్తి ఎలక్ట్రికల్‌ సామాగ్రిని చోరీ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మియాపూర్‌ డీఐ రమేష్‌ నాయుడు తెలిపిన మేరకు.. నిజామాబాద్‌ నవీపేట్‌కు చెందిన కల్లూరి లక్ష్మణ్‌ (39) జీడిమెట్ల రాంరెడ్డినగర్‌లో నివాసముంటూ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ జీననం కొనసాగిస్తున్నారు. డబ్బు సరిపోకపోవడంతో చోరీలబాట పడ్డాడు. ఈ క్రమంలో ఓ నిర్మాణ సంస్థలో ఎలక్ట్రికల్‌ సామాగ్రి మాయమవుతుండటంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాలు పరిశీలించగా దొంగతనం చేసింది కల్లూరి లక్ష్మణ్‌ అని గుర్తించారు. అతని వద్ద నుండి రూ.1.50 లక్షలు విలువ చేసే వస్తువులు స్వాధీనం చేసుకొని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement