విద్యాబోధనలో ఏఐ వినియోగం | - | Sakshi
Sakshi News home page

విద్యాబోధనలో ఏఐ వినియోగం

May 1 2026 5:51 AM | Updated on May 1 2026 5:51 AM

కలెక్టర్‌ డాక్టర్‌ ప్రియాంక అల

సాక్షి, సిటీబ్యూరో : విద్యా బోధనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడించడంతోపాటు కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగాన్ని ప్రోత్సహించాలని హైదరాబాద్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ప్రియాంక అల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో విద్యాశాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్న భోజన నాణ్యత పాటించడంతో పాటు మెనూ కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరచేందుకు అవసరమైన చోట తరగతి గదుల విస్తరణ, అభివృద్ధి చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సూచించారు. విద్యార్థుల పురోగతిని సమీక్షించేందుకు తరచూ పేరెంట్స్‌ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం పాఠశాలలకు కార్పొరేట్‌ పాఠశాలలతో సమానంగా వసతులు కల్పిస్తున్నందున, ఫలితాలు కూడా అదే స్థాయిలో రావాలని ఆదేశించారు. విద్యాధికారులు, ఉప విద్యాధికారులు పాఠశాలలను నిరంతర తనిఖీలు నిర్వహించేలా చూడాలని సూచించారు. పర్యవేక్షణలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, 15 రోజులకు ఒకసారి సమీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి, ఏడీ వెంకటేశ్వర్లు, డిప్యూటీ డీఈఓలు, సెక్టోరియల్‌ అధికారులు, ఇంజనీరింగ్‌ అధికారులు, విద్యాశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement