బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి

May 1 2026 5:51 AM | Updated on May 1 2026 5:51 AM

హిమాయత్‌నగర్‌ : బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదన చారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన గురువారం బషీర్‌బాగ్‌ దేశోద్ధారక భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీ మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్‌న్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని మోదీ బీసీల హామీలు తుంగలో తొక్కి, వారి ఆశల మీద నీళ్లు చల్లారని మండిపడ్డారు. ఎర్ర సత్యనారాయణ మాట్లాడుతూ ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న 42 శాతం బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన రెండు బిల్లులపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో బీసీ జేఏసీ వర్కింగ్‌ చైర్మన్‌ గుజ్జ కృష్ణ, వేముల రామకృష్ణ పాల్గొన్నారు.

జలమండలి ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీధర్‌ పదవీ విరమణ

సాక్షి, సిటీ బ్యూరో: జలమండలి ప్రాజెక్టు డైరెక్టర్‌ టీవీ శ్రీధర్‌ పదవీ విరమణ చేశారు. గురువారం ఖైరతాబాద్‌ లోని ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఎండీ అశోక్‌ రెడ్డి హాజరై ఘనంగా సన్మానించారు. డైరెక్టర్లు వినోద్‌ భార్గవ, నారాయణ, శ్రీనివాస రెడ్డి, ఇతర ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement