సగర కులస్తుల సమస్యల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

సగర కులస్తుల సమస్యల పరిష్కారానికి కృషి

Apr 24 2026 8:08 AM | Updated on Apr 24 2026 8:08 AM

గన్‌ఫౌండ్రీ: సగర కులస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. గురువారం రవీంద్రభారతిలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ సగర భగీరథ మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ సగర కులస్తులను బీసీ– డి నుంచి మార్పు, జీఓ నెంబర్‌ 59 వంటి విషయాలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్‌, బీసీ జేఏసీ చైర్మన్‌ జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌, బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి బాల మాయాదేవి, సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్‌ సగర, ఆత్మగౌరవ భవన వెల్ఫేర్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ మారుతీసాగర్‌తోపాటు వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement