సాక్షి, సిటీబ్యూరో: ప్రయోగాల పేరుతో మూగజీవాలపై జరగుతున్న హింసను ఆపాలని జంతు హక్కుల సంస్థ పెటా ఇండియా నినదించింది. ప్రధానంగా పాలమూరు బయోసైన్సెస్ సంస్థలో ప్రయోగాల పేరుతో నిర్బంధించిన 1200 జంతువులను పునరావాస కేంద్రాలకు తరలించాలని తీవ్ర నిరన చేపట్టారు. కేబీఆర్ పార్క్ వద్ద పెటా ఇండియా సభ్యులు, వీగన్స్ ఆఫ్ తెలంగాణ మద్దతుదారులు గురువారం ఆందోళన చేపట్టారు. పాలమూరు బయోసైన్సెస్‌లో 1200కి పైగా కుక్కలు, కోతులు, గొర్రెలు, పందులు తదితర జంతువులను బ్రీడింగ్, ప్రయోగాల పేరుతో బందీగా ఉంచారని ఆరోపించారు. 73 బీగిల్ కుక్కలను పునరావాసానికి అనుకూలమని సంస్థే గుర్తించినప్పటికీ, వాటిని విడుదల చేయకుండా నిరాకరిస్తోందని పేర్కొంది.


