18వ అంతస్తు నుంచి దూకి యువకుడి ఆత్మహత్య! | - | Sakshi
Sakshi News home page

18వ అంతస్తు నుంచి దూకి యువకుడి ఆత్మహత్య!

Apr 24 2026 8:08 AM | Updated on Apr 24 2026 8:08 AM

మణికొండ: తన బాబాయి ఇంటికి వచ్చిన ఓ యువకుడు 18వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పీరంచెరువు పీబీఎల్‌ సిటీలో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన మేరకు.. సాయి ఆశీష్‌రెడ్డి(30) తన బాబాయి నివసిస్తున్న పీఈబీఎల్‌ సిటీకి గురువారం వచ్చాడు. అంతలో ఏమి జరిగిందో 18వ అంతస్తునుంచి దూకాడు. దాంతో అతని తలకు బలమైన గాయాలై చిత్రమయ్యింది. నార్సింగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement