కల్తీనూనె వంటకాలు.. షాప్‌ సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

కల్తీనూనె వంటకాలు.. షాప్‌ సీజ్‌

Apr 24 2026 8:08 AM | Updated on Apr 24 2026 8:08 AM

మోతీనగర్‌: కల్తీనూనెతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారన్న విశ్వసనీయమైన సమాచారం మేరకు ఫుడ్‌సేఫ్టీ అధికారులు దాడి చేసి ఓ షాప్‌ను సీజ్‌ చేశారు. సీఐ ఎస్‌.వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... అల్లాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కై త్లాపూర్‌ ఫ్లైఓవర్‌ పరిసర ప్రాంతాల్లోని నసీబ్‌ బైరిష్టా అనే షాపులో కొంతమంది వ్యక్తులు పాడైన, వాడిన నూనెతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఫుడ్‌సేఫ్టీ అధికారిణి హృదయ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీ నిర్వహించారు. వంద లీటర్ల మేర పాడైన వంటనూనెను స్వాధీనం చేసుకున్నారు. షాపును సీజ్‌ చేశారు. ఈ కల్తీ నూనెతో ఉల్లిపాయలు వేయించి పెద్ద హోటల్స్‌కు సప్‌లై చేసి బిర్యాని వంటకంలో ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఇటువంటి ఆహార పదార్థాలు తినడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతారని పేర్కొన్నారు. ఫుడ్‌సేఫ్టీ అధికారి ఫిర్యాదుతో అల్లాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement