మ్యూల్‌ ఖాతాలపై ఉక్కుపాదం | - | Sakshi
Sakshi News home page

మ్యూల్‌ ఖాతాలపై ఉక్కుపాదం

Apr 24 2026 8:08 AM | Updated on Apr 24 2026 8:08 AM

వినియోగదారుల భద్రతే లక్ష్యం

కొత్వాల్‌ సజ్జనర్‌

సాక్షి, సిటీబ్యూరో: బ్యాంకు అధికారులు కేవలం కొత్త ఖాతాలు తెరవడమే లక్ష్యంగా పెట్టుకోకుండా వినియోగదారుల భద్రతకు పెద్దపీట వేయాలని నగర సీపీ సజ్జనర్‌ అన్నారు. బంజారాహిల్స్‌లోని ఐసీసీసీలో గురువారం ఆయన బ్యాంకు అధికారులతో సమావేశమయ్యారు. రెండు దశల్లో నిర్వహించిన ‘ఆపరేషన్‌ ఆక్టోపస్‌’ నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన లోపాలకు వారి దృష్టికి తీసుకువచ్చారు. 45 బ్యాంకులకు చెందిన 75 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సైబర్‌ నేరగాళ్లకు సహకరిస్తున్న మ్యూల్‌ ఖాతాలను అరికట్టేందుకు ’సేఫ్‌ కస్టమర్‌ చాలెంజ్‌’ను బ్యాంకులు స్వీకరించాలన్నారు. ఈ క్రమంలో ప్రతి బ్యాంకు శాఖ ’జీరో మ్యూల్‌ అకౌంట్స్‌’ లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఏ బ్యాంకు శాఖలోనూ సైబర్‌ బాధితులు ఉండకూడదని, నేషనల్‌ సైబర్‌ క్రైౖ మ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌లో నమోదయ్యే ఫిర్యాదుల ఆధారంగా బ్రాంచీల పనితీరును అంచనా వేసుకోవాలని స్పష్టం చేశారు. ’ఆపరేషన్‌ ఆక్టోపస్‌ 2.0’లో 850 కేసుల్లో రూ. 150 కోట్ల మోసాలను గుర్తించామని, మ్యూల్‌ ఖాతాల ఓపెనింగ్‌లో సహకరించిన 32 మంది బ్యాంకు అధికారులను అరెస్ట్‌ చేశామని వెల్లడించారు. కంబోడియా, వియత్నాం, దుబాయ్‌ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ముఠాలు దళారుల ద్వారా స్థానిక బ్యాంకు అధికారులతో కుమ్మకై ్క ఈ నేరాలకు పాల్పడుతున్నాయని వివరించారు. మ్యూల్‌ ఖాతాలను గుర్తించేందుకు ‘మ్యూల్‌ హంటర్‌’ వంటి టెక్నాలజీని వాడాలని, సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌1930పై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ఆర్‌బీఐ రీజినల్‌ డైరెక్టర్‌ చిన్మయ్‌ కుమార్‌, అడిషనల్‌ సీపీ ఎం. శ్రీనివాసులు పాల్గొన్నారు.

7

సజ్జనర్‌@

సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు కమిషనరేట్‌లో మరోసారి అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు (డీజీపీ) హోదాలో ఉన్న అధికారి కొత్వాల్‌ పోస్టులో నగర పోలీసు విభాగానికి నేతృత్వం వహించనున్నారు. ఇంతకుముందు పేర్వారం రాములు, అనురాగ్‌ శర్మ, ఎం.మహేందర్‌రెడ్డి, అంజనీకుమార్‌, ఆనంద్‌, కొత్తకోట శ్రీనివాసరెడ్డిలు ఇలానే వ్యవహరించారు. ఇప్పుడు కొత్వాల్‌ సజ్జనర్‌కు డీజీపీగా పదోన్నతి లభించింది. బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్‌ కార్యాలయంలో సజ్జనర్‌ గురువారం డీజీపీ హోదాలో నగర పోలీసు కమిషనర్‌గా కుటుంబ సభ్యుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement