జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్
సనత్‌నగర్: ఎలక్ట్రానిక్ వ్యర్థాలు (ఈ–వేస్ట్) సరైన నిర్వహణలో జీహెచ్‌ఎంసీ మరో కీలక అడుగు పడింది. అమీర్‌పేటలోని హ్యాపీ, బిగ్‌సీ స్టోర్లలో ఈ–వేస్ట్ ఎకో సిస్టమ్ కార్యకమాన్ని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్.. ఎర్త్ సెన్స్ సంస్థ ప్రతినిధులతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఈ–వేస్ట్ ఎకో సిస్టమ్ విధానాన్ని వివరించారు. ఈ ఏడాది జనవరి నుంచి ప్రజల నుంచి ఈ–వేస్ట్ సేకరణతో పాటు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతూ వస్తుండగా, ఈ ప్రయత్నాలను దీర్ఘకాలికంగా కొనసాగించేందుకు ప్రత్యేకంగా ఈ–వేస్ట్ నిర్వహణ వ్యవస్థను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. క్యూఆర్ కోడ్ ఆధారంగా ఈ కొత్త వ్యవస్థ ద్వారా పౌరులకు మూడు మార్గాల్లో సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. భవిష్యత్తులో ఈ సేవలను మరింత విస్తరించనున్నట్లు ఆయన తెలిపారు.


