అర్హులందరికీ సంక్షేమ పథకాలు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

Apr 10 2026 10:33 AM | Updated on Apr 10 2026 10:33 AM

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

సాక్షి, సిటీబ్యూరో: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలని హైదరాబాద్‌ ఇంచార్జి మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆకాంక్షించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక– 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రాజ్యసభ సభ్యులు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఖైరతాబాద్‌ శాసనసభ్యులు దానం నాగేందర్‌, కలెక్టర్‌ హరి చందన దాసరితో కలిసి కలెక్టరేట్‌లో సమత కిచెన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. అన్ని వర్గాల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధిగా అయన ఆభివర్ణించారు.సమాజంలోని వృద్ధులు దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లను ఆర్థిక కార్యకలాపాల్లో భాగస్వామ్యం చేయడం ద్వారా ఆర్థిక చేయూత తో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి పేర్కొన్నారు.

● రాజ్యసభ సభ్యులు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ ట్రాన్స్‌జెండర్లు సమాజంలో అంతర్భాగమని, వారి గౌరవప్రద జీవనానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సమత కిచెన్‌ కు ఎంపీ ల్యాడ్స్‌ నిధులను తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.

● ఎమ్మెల్యే దానం నాగేందర్‌ మాట్లాడుతూ.. కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో 10 శాతం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ ఈబీసీ, దివ్యాంగుల కోటాను అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్‌ హరిచందన దాసరి మాట్లాడుతూ నిరంతర సహాయక చర్యలతో పాటు, సమతా కిచెన్‌ వంటి ఉపాధి ఆధారిత కార్యక్రమాల ద్వారా స్థిరమైన జీవనోపాధిని కల్పించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు.

మంత్రి పొన్నం ప్రభాకర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement