మాదాపూర్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై గురువారం తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.. హెచ్‌ఐవీ నివారణకు ప్రభుత్వం ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ద్వారా టెస్టులు, స్క్రీనింగ్ నిర్వహిస్తోందన్నారు. ఎయిడ్స్ అంటే ఏమిటి? హెచ్‌ఐవీ అంటే ఏమిటి? విషయాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని సూచించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పాల్గొన్నారు. – మాదాపూర్


