గ్రేటర్‌లో రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం
సాక్షి, సిటీబ్యూరో: పశ్చిమాసియా యుద్ధంతో గ్యాస్ కొరత తలెత్తి ఇండక్షన్ స్టవ్‌లు, ఎలక్ట్రిక్ కుక్కర్ల వినియోగం పెరిగింది. మరోవైపు బయట ఎండలు భగ్గుమంటున్నాయి. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు గిరగిరా తిరుగుతున్నాయి. దీంతో గ్రేటర్ పరిధి జిల్లాల్లో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో నమోదవుతోంది. నిరుడు ఇదే సమయంతో పోలిస్తే... రోజుకు సగటున 250 మెగావాట్ల పైగా అధిక డిమాండ్ ఉంటోంది. సాధారణంగా పగటి వేళ ఉండే ఈ పరిస్థితి.. ఉదయం 8 గంటలకే కనిపిస్తుండడం గమనార్హం. వాణిజ్య సిలిండర్లపై ఆంక్షలతో అందరూ ఎలక్ట్రిక్ కుక్కర్లను ఆశ్రయిస్తున్నారు. దీనికితోడు గ్రేటర్‌లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగి 1,86,369కు చేరుకుంది. రికార్డు స్థాయి డిమాండ్‌కు ఇది మరో కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇదంతా ఒక్కసారిగా జరగడంతో సబ్‌స్టేషన్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, వీధుల్లోని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు హీటెక్కుతున్నాయి. ఫీడర్లు ట్రిప్పవుతుండటంతో సరఫరాలో తరచూ అంతరాయాలు తలెత్తుతున్నాయి. డీటీఆర్‌లు పేలుతున్న ఘటనలూ లేకపోలేదు.
తేదీ 2025 2026
01 3563 3919
02 3574 3867
03 3523 3866
04 3469 3826
05 3202 3517
06 3753 3944
07 3768 3933
08 3768 3989


