రోబోటిక్ శస్త్ర చికిత్సల్లో కచ్చితత్వం ఉంటుంది | Robotic surgeries offer precision | Sakshi
Sakshi News home page

రోబోటిక్ శస్త్ర చికిత్సల్లో కచ్చితత్వం ఉంటుంది

Apr 10 2026 1:10 PM | Updated on Apr 10 2026 1:19 PM

Robotic surgeries offer precision

హైదరాబాద్ : రోబోటిక్ శస్త్ర చికిత్సల్లో కచ్చితత్వం ఉంటుందని మంచి ఫలితాలు కనిపిస్తాయని అపోలో ఆసుపత్రి  సీనియర్ కన్సల్టెంట్ హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డాక్టర్ నాగేష్ అయ్యల సోమయాజులు తెలిపారు. అపోలో ఆసుపత్రిలో 155 రోజుల్లో 100 రోబోటిక్ కార్డు శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా ఆయన ఆస్పత్రి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంప్రదాయ ఓపెన్ హార్ట్ సర్జరీ లతో పోలిస్తే రోబోటిక్స్ శస్త్ర చికిత్సల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని శరీరం ఎక్కువ కోతకు గురి కాదని రక్తస్రావం కూడా చాలా తక్కువగా ఉంటుందని దీనివల్ల రోగులు తొందరగా కోలుకుంటారని అన్నారు.

జే ఎం డి సంగీత రెడ్డి మాట్లాడుతూ రోబోటిక్  కార్డియక్ సర్జరీ ల వల్ల చికిత్సలు స్థిరత్వం పెరగడంతో పాటు రోగుల భద్రత సౌకర్యం మెరుగుపడతాయని అన్నారు. భవిష్యత్తు వైద్యరంగంలో ఈ రోబోటిక్ సర్జరీలు మరింత కీలకంగా మారనున్నాయని ఆమె అన్నారు. ఈ సమావేశంలో ఆస్పత్రి సీఈవో తేజస్వి రావు వీరపల్లి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement