ప్రాణాలతో బయటపడిన 45 మంది.. | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలతో బయటపడిన 45 మంది..

Apr 10 2026 10:39 AM | Updated on Apr 10 2026 10:39 AM

బహదూర్‌పల్లిలోని డెకరేషన్‌ ఈవెంట్‌ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయగిరి కాలనీలో వెంకటేష్‌ అనే వ్యక్తి ఎస్‌వీఎన్‌ పేరిట డెకరేషన్‌ ఈవెంట్‌ గోదాం నడుపుతున్నాడు. గురువారం ఉదయం 6 గంటల సమయంలో గోదాం పక్కనే ఉన్న విద్యుత్‌ వైర్ల వద్ద షార్ట్‌ సర్క్యూట్‌ మంటలు చెలరేగాయి. డెకరేషన్‌ సామగ్రితో పాటు, కారు, టాటా ఏసీ వాహనం అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు కోటి రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా. కాగా.. గోదాముకు ఆనుకొని ఉన్న గోకులం రెసిడెన్సీ భవనం రెండంతస్తుల వరకు మంటలు వ్యాపించి డోర్లు, కిటికీలు కాలి బూడిద అయ్యాయి. భవనంలోని 45 మంది వెనక నుంచి గ్రిల్స్‌ తొలగించుకొని బయటపడ్డారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల ఫైర్‌ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. గోదాముకు ఎవరో కావాలనే నిప్పు పెట్టారని యజమాని వెంకటేష్‌ ఆరోపించారు.

మంటల్లో డెకరేషన్‌ ఈవెంట్స్‌ గోదాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement