నుమాయిష్‌.. జోష్‌ | - | Sakshi
Sakshi News home page

నుమాయిష్‌.. జోష్‌

Jan 22 2024 5:58 AM | Updated on Jan 22 2024 7:28 AM

- - Sakshi

అబిడ్స్‌: ఎగ్జిబిషన్‌ సందర్శకులతో కిక్కిరిసింది. 83వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శనశాల (నుమాయిష్‌)ను ఆదివారం 80 వేల మంది సందర్శించారు. జనవరి 1వ తేదీన ప్రారంభమైన ఎగ్జిబిషన్‌ ఫిబ్రవరి 15న ముగియనుంది. ఆదివారం వరకు దాదాపు 8.50 లక్షల మంది ఎగ్జిబిషన్‌ను సందర్శించారని ఎగ్జిబిషన్‌ సొసైటీ ఉపాధ్యక్షులు వనం సత్తేందర్‌, కార్యదర్శి హనుమంతరావు, కోశాధికారి ఏనుగుల రాజేంద్రకుమార్‌లు తెలిపారు.

సందర్శకుల సౌకర్యార్థం ఎగ్జిబిషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశామన్నారు. వలంటీర్లతో పాటు పోలీసులు ఆదివారం ఎగ్జిబిషన్‌ పరిసరాల్లో ఎగ్జిబిషన్‌ లోపల భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు బేగంబజార్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.శంకర్‌ తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ముమ్మరం చేశామన్నారు. మఫ్టిలో పోలీసులు ఉండి బందోబస్తు చేపడుతున్నారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement