
నాంపల్లి: అగ్ని ప్రమాదం నుండి వెలువడిన దట్టమైన పొగలను చూసిన స్థానిక బజార్‌ఘాట్ యువకులు అక్కడికి చేరుకున్నారు. ఇమ్రాన్, అబ్రార్, లడ్డూ, సనాఖాన్, జాఫర్, సుమేర్, రిజ్వాన్‌లు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా స్థానికుల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.
అంతటితో ఆగకుండా అపార్ట్‌మెంట్‌లో చిక్కుకున్న వారిని రక్షించడానికి లోనికి ప్రవేశించే సాహసం చేశారు. అప్పటికింకా ఫైరింజన్ రాకపోవడంతో వేచిచూడకుండా బాధితులను రక్షించేందుకు సహాయక చర్యలను చేపట్టారు. నిచ్చెనల సహాయంతో అపార్ట్‌మెంట్ పైకి ఎక్కి తలుపులు తెరిచేందుకు చేసిన సాహసం ఫలించలేదు. మంటల ధాటికి ఇంట్లోని వారు అప్పటికే సజీవ దహనమయ్యారు. అనంతరం పోలీసుల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు.