Telangana Crime News: బాలుడిపై లైంగికదాడి! ఆ బాలుడు తల్లిదండ్రులకు చెప్పడంతో..
Sakshi News home page

బాలుడిపై లైంగికదాడి! ఆ బాలుడు తల్లిదండ్రులకు చెప్పడంతో..

Sep 22 2023 6:58 AM | Updated on Sep 22 2023 8:37 AM

- - Sakshi

హైదరాబాద్‌: బాలుడిపై లైంగికదాడికి పాల్పడిన ఓ వృద్ధుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం మేరకు... బోరబండ డివిజన్‌ బ్రాహ్మణవాడి బస్తీలో నివసించే సయ్యద్‌ రవూఫ్‌ (65) అదే ప్రాంతంలో కిరాణ షాపు నిర్వహిస్తున్నాడు. సరుకుల కొనుగోలు నిమిత్తం ఇతని దుకాణానికి గురువారం 3వ తరగతి చదువుతున్న ఓ బాలుడు (7) వచ్చాడు.

రవూఫ్‌ ఆ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంటికి వెళ్లిన బాలుడు తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కొంతకాలంగా చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బస్తీ వాసులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement