కోకాపేటలో కార్‌ రేసింగ్‌ | Sakshi
Sakshi News home page

కోకాపేటలో కార్‌ రేసింగ్‌

Published Fri, Jul 21 2023 5:38 AM

పోలీసులు సీజ్‌ చేసిన కార్లు  - Sakshi

హైదరాబాద్: కోకాపేట నియోపోలీస్‌ కేంద్రంగా కార్‌రేసింగ్‌కు పాల్పడిన ఆరుగురు యువకులను నార్సింగి పోలీసులు అరెస్టు చేసి కౌన్సిలింగ్‌కు తరలించారు. నార్సింగి సీఐ శివకుమార్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. హైదరాబాద్‌ నగరానికి చెందిన కొందరు యువకులు ఖరీదైన కార్లలో శుక్రవారం సాయంత్రం రేసింగ్‌కు పాల్పడుతున్నారు. వీంతో భయాందోళనకు గురైన స్థానికులు 100కు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కార్లతో సహా వారిని అదుపులోకి తీసుకున్నారు. నార్సింగి ట్రాఫిక్‌ సీఐ మధుసూదన్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రేసర్లను గురువారం కౌన్సెలింగ్‌కు పంపామని, సీజ్‌ చేసిన కార్లను కోర్టుకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. సదరు కార్లు పాండిచ్చేరి, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్‌ అయి ఉన్నందున అవి మన రాష్ట్రంలో తిరిగేందుకు అవకాశం ఉందా..లేదా స్పష్టం చేయాలని ఆర్‌టీఏ అధికారులకు లేఖ రాశామన్నారు. రేసింగ్‌కు పాల్పడిన యువకులు సంపన్న కుటుంబాలకు చెందిన వారు కావడంతో వారి పేర్లను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు.

వారం రోజుల క్రితం రేసింగ్‌కు పాల్పడితే వారిని గురువారం కౌన్సెలింగ్‌కు, కార్లను కోర్టుకు అప్పగించడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రేసింగ్‌కు పాల్పడిన వారిలో సయ్యద్‌ మాజీద్‌ హుస్సేన్‌, రాకేష్‌, నారాయణ, ధన్‌రాజ్‌, రమణ, మణికొండ కంఠ శర్మ ఉన్నట్లు సమాచారం.

 

Advertisement
Advertisement