Telangana Appoints Anudeep Durishetty As Hyderabad District New Collector - Sakshi
Sakshi News home page

కొత్త కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి

Jul 15 2023 11:40 AM | Updated on Jul 17 2023 6:59 PM

- - Sakshi

హైదరాబాద్‌: హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా అనుదీప్‌ దురిశెట్టిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో గతేడాది కాలంగా ఇన్‌చార్జి కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న అమయ్‌కుమార్‌ను బాధ్యతల నుంచి తప్పించింది. 2018 బ్యాచ్‌కు చెందిన అనుదీప్‌ దురిశెట్టి ప్రస్తుతం భద్రాది కొత్తగూడెం అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు)గా విధులు నిర్వర్తిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్ధలు)గా ప్రతిమా సింగ్‌ నియమితులయ్యారు. ఇక్కడ పని చేస్తున్న ప్రతీక్‌ జైన్‌ భద్రాచలం ఐటీడీఏ పీఓగా బదిలీ అయ్యారు.

జీహెచ్‌ఎంసీకి ఒకరి రాక.. మరొకరి పోక

ఐఏఎస్‌ అధికారుల బదిలీల్లో భాగంగా జీహెచ్‌ఎంసీ నుంచి ఒకరు బదిలీ కాగా, మరొకరు రానున్నారు. జీహెచ్‌ఎంసీలో అడిషనల్‌ కమిషనర్‌ (రెవెన్యూ, లీగల్‌, ట్రేడ్‌ లైసెన్సులు, హెల్త్‌, వెటర్నరీ)గా పనిచేస్తున్న ప్రియాంక అలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. స్నేహ శబరీష్‌ జీహెచ్‌ఎంసీకి అడిషనల్‌ కమిషనర్‌గా రానున్నారు.

పూర్తి పేరు : అనుదీప్‌ దురిశెట్టి

జననం : 6 జూలై 1989

విద్యార్హత : బీటెక్‌ (బిట్స్‌ పిలానీ, రాజస్థాన్‌)

ఐఏఎస్‌ బ్యాచ్‌: 2018 (2017 యూపీఎస్‌సీ టాపర్‌)

స్వస్థలం : మెట్‌పల్లి, జగిత్యాల జిల్లా

Advertisement
 
Advertisement
Advertisement