అమెరికాలో భర్త హఠాన్మరణం.. తట్టుకోలేక సాహితి ఇక్కడ..

క్రైమ్: భర్త మృతిని తట్టుకోలేని ఓ ఇల్లాలు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన గురువారం అంబర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ అశోక్ కథనం ప్రకారం.. డీడీ కాలనీకి చెందిన సాహితి (29)కి ఏడాదిన్నర క్రితం వనస్థలిపురంనకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మనోజ్ (31)తో వివాహమైంది. పెళ్లి అనంతరం వీరు అమెరికా డల్లాస్‌కు వెళ్లి నివాసం ఉంటున్నారు.
ఈ నెల 2న సాహితి తల్లిదండ్రులను చూడడానికి అమెరికా నుంచి నగరానికి వచ్చింది. ఈ క్రమంలో 20వ తేదీన అమెరికాలో ఉన్న మనోజ్ గుండెపోటుతో మృతి చెందాడు. మృతదేహాన్ని ఈ నెల 23న వనస్థలిపురంనకు తీసుకువచ్చారు. 24న మనోజ్ అంతక్రియలు జరిగాయి. భర్త అంతక్రియలకు వెళ్లిన సాహితి రాత్రి తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వచ్చింది. ఆమె సోదరి సంజన గదిలో నిద్రించింది.
గురువారం ఉదయం నిద్రలేచిన సంజన వాష్‌రూంకు వెళ్లగానే సాహితి లేచి లోపలి నుంచి గది గడియ పెట్టుకుంది. చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే తేరుకున్న కుటుంబ సభ్యులు బలవంతంగా గది తలుపులు తెరిచి సమీప ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు చెప్పారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వార్తలు :