ఐపీఎస్ ఆఫీసర్ కారును తన్నిన డింపుల్ హయాతి..కేసు నమోదు.. | Police Case On Dimple Hayathi | Sakshi
Sakshi News home page

అపార్ట్‌మెంట్‌లో సినీ నటి డింపుల్‌ హయతి దురుసు ప్రవర్తన

May 23 2023 8:40 AM | Updated on May 23 2023 8:50 AM

Police Case On Dimple Hayathi - Sakshi

బంజారాహిల్స్‌: ఐపీఎస్‌ అధికారి అధికారిక కారును కాలితో తన్నడమే కాకుండా తన బెంజికారుతో రివర్స్‌లో వచ్చి ఢీకొట్టి దుర్భాషలాడిన ఘటనలో సినీ నటిపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే... జూబ్లీహిల్స్‌ హుడా ఎన్‌క్లేవ్‌ జర్నలిస్టు కాలనీలోని ఎస్‌కేఆర్‌ అపార్ట్‌మెంట్స్‌లో ఓ ఐపీఎస్‌ అధికారి ఫ్లాట్‌లో అద్దెకుంటున్నారు. ఇదే అపార్ట్‌మెంట్స్‌లో సినీ నటి డింపుల్‌ హయతి కూడా అద్దెకుంటున్నారు. ట్రాఫిక్‌ విభాగంలో డీసీపీగా పని చేస్తున్న ఐపీఎస్‌ అధికారి అధికారిక వాహనాన్ని (టీఎస్‌ 09 పీఏ 1744) అపార్ట్‌మెంట్‌ పార్కింగ్‌ స్థలంలో పార్కింగ్‌ చేశారు.

అయితే సదరు నటి డింపుల్‌ ఈ వాహనాన్ని తరచూ కాలితో తన్నడమే కాకుండా తన కాబోయే భర్త డేవిడ్‌తో కలిసి బెంజి కారు (ఏపీ 09 సీఎల్‌ 0927)తో రివర్స్‌ తీసుకొచ్చి డ్యామేజీ చేస్తున్నట్లు గుర్తించిన కారు డ్రైవర్‌ ఇదేమిటని పలుమార్లు ప్రశ్నించారు. మీ సార్‌ ఐపీఎస్‌ అధికారి అయితే మేం భయపడాలా అంటూ అర్థం పర్థం లేకుండా మాట్లాడటమే కాకుండా పోలీసులను కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నది. ఈ కారుకు భద్రతగా ఏర్పాటు చేసిన కోన్స్‌ను కూడా ఆమె పీకిపడేసేది.

డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగడం, గన్‌మెన్లను బెదిరించడం నిత్యకృత్యంగా పెట్టుకుంది. ఏనాడూ సదరు అధికారి ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు. గన్‌మెన్లు, డ్రైవర్‌ నచ్చజెప్పేందుకు చూసినా ఆమె వినిపించుకోకపోగా ఆగడాలు రోజురోజుకు శృతిమించాయి. దీంతో అధికారి డ్రైవర్‌ చేతన్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్‌ పోలీసులు డింపుల్‌పై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన ఘటనలో ఐపీసీ సెక్షన్‌ 353, 341, 279 కింద కేసు నమోదు చేసి సోమవారం విచారణకు పిలిపించారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement