దివ్యాంగులను ప్రోత్సహించాలి | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగులను ప్రోత్సహించాలి

Nov 6 2026 2:32 AM | Updated on Nov 6 2026 2:32 AM

దివ్యాంగులను ప్రోత్సహించాలి

న్యాయమూర్తులు వీబీ నిర్మలాగీతాంబ,

మంత్రి రామకృష్ణ సునీత

వరంగల్‌ లీగల్‌: ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారుల్లో అపారమైన ప్రతిభ దాగి ఉందని, దివ్యాంగులకు ప్రోత్సాహం, అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని వరంగల్‌, హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తులు వీబీ నిర్మలాగీతాంబ, మంత్రి రామకృష్ణ సునీత పేర్కొన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారుల్లోని సృజనాత్మకతను ప్రోత్సహించేలా మల్లికాంబ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన రంగురంగుల మట్టి ప్రమిదల విక్రయ కేంద్రాన్ని హనుమకొండ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేయగా.. గురువారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులు స్వయంగా తయారుచేసిన రంగురంగుల ప్రమిదలను న్యాయమూర్తులు పరిశీలించారు. ప్రమిదలను కొనుగోలు చేసి చిన్నారులను ప్రోత్సహించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో ప్రమిదల స్టాల్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందని వారు వివరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థల కార్యదర్శులు ఎన్వీ హైమ పూజిత, కె.పూజ, న్యాయమూర్తులు, ఇరు జిల్లాల బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు, అనురాగ్‌ హెల్పింగ్‌ సొసైటీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ కె.అనితారెడ్డి, మల్లికాంబ సంస్థ వ్యవస్థాపకురాలు, ప్రధాన కార్యదర్శి బండ రామలీల, కోడం కల్యాణ్‌, సంస్థ సిబ్బంది, చిన్నారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement