రూ.1.13 కోట్ల ఆస్తిపన్ను జేబుల్లోకి.. | - | Sakshi
Sakshi News home page

రూ.1.13 కోట్ల ఆస్తిపన్ను జేబుల్లోకి..

Nov 13 2026 8:27 AM | Updated on Nov 13 2026 8:27 AM

రూ.1.13 కోట్ల ఆస్తిపన్ను జేబుల్లోకి.. గ్రేటర్‌ 43వ డివిజన్‌ ఆఫీసర్‌ గఫార్‌ఖాన్‌పై సస్పెన్షన్‌ వేటు

గ్రేటర్‌ 43వ డివిజన్‌ ఆఫీసర్‌ గఫార్‌ఖాన్‌పై సస్పెన్షన్‌ వేటు

● విచారిస్తే మరిన్ని బాగోతాలు వెలుగులోకి..

వరంగల్‌ అర్బన్‌: గ్రేటర్‌ వరంగల్‌ పన్నుల విభాగంలో అవినీతి రాజ్యమేలుతోంది. పెద్ద మొత్తంలో పన్నులు చెల్లించాల్సి వస్తుందని భవన నిర్మాణదారులను బెదిరిస్తూ కొందరు అడ్డగోలుగా అవినీతి పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 43వ డివిజన్‌ వార్డు ఆఫీసర్‌ ఎంఏ గఫార్‌ఖాన్‌ ఉదంతం గురువారం వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో బల్దియా ప్రత్యేకాధికారి, హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ సదరు వార్డు ఆఫీసర్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భవన యజమానుల నుంచి వార్డు ఆఫీసర్‌ వసూలు చేసిన రూ.1,13,00,452 ఆస్తిపన్ను మొత్తాన్ని మున్సిపల్‌ ఖజానాలో జమ చేయలేదు. సంబంధిత డిప్యూటీ కమిషనర్‌, రెవెన్యూ ఆఫీసర్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ దృష్టి సారించలేదు. ఈ నేపథ్యంలో వార్డు ఆఫీసర్‌ ఆ మొత్తాన్ని సొంతానికి వాడుకున్నట్లు స్పెషల్‌ ఆఫీసర్‌ గుర్తించారు. దీనిపై వార్డు ఆఫీసర్‌ను వివరణ కోరగా ఎలాంటి సమాధానం లేకపోవడంతో సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ సస్పెన్షన్‌ తక్షణమే అమల్లోకి వస్తుందని, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కొనసాగుతుందని ఆమె తెలిపారు. అనుమతి లేకుండా హనుమకొండ జిల్లా కేంద్రాన్ని విడిచి వెళ్లరాదని ఆదేశించారు. అలాగే, తన వద్ద ఉన్న మున్సిపల్‌ రికార్డులు, పన్ను వసూలు రిజిస్టర్లు, రశీదు పుస్తకాలు, నగదు తదితరాలను సంబంధిత అధికారులకు అప్పగించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదాయం విషయంలో ఎలాంటి అవకతవకలు, నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, ప్రజాధనం పరిరక్షణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందేనని ఈ చర్య ద్వారా ప్రత్యేక అధికారి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement