కాజీపేట అర్బన్: నిట్ వరంగల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ) ప్రొఫెసర్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ అల్యూమ్ని అఫైర్స్ డీన్ టి.కిశోర్‌కుమార్ పద్మవిభూషణ్ డాక్టర్ మురళీమనోహర్ జోషి అవార్డ్స్–2026కు ఎంపికయ్యారు. న్యూఢిల్లీకి చెందిన ఫెడరేషన్ ఫర్ వరల్డ్ అకడమిక్స్ (ఎఫ్‌డబ్ల్యూఏ) సంస్థ వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి అందించే ఈ అవార్డుకు కిశోర్‌కుమార్‌ను ఎంపిక చేసింది. న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంట ర్‌లో ఈనెల 22న నిర్వహించే 9వ ఎఫ్‌డబ్ల్యూఏ కాన్‌క్లేవ్‌లో ఆయన డాక్టర్ మురళీమనోహర్ జోషి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. ఈ సందర్భంగా నిట్ యాజమాన్యం ప్రొఫెసర్ కిశోర్‌కుమార్‌ను అభినందించింది.
విద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో రెండు సబ్జెక్టుల్లో విద్యాబోధనకు గెస్ట్ లెక్చరర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ రంగయ్యనాయుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కళలు, కళావిద్య (తెలుగు అండ్ ఇంగ్లిష్ మీడియం, వేతనం రూ.15,660) బోధనకు, పెడగాజి ఆఫ్ సైన్స్ ఉర్దూమీడియం(వేతనం రూ.23,400)లో ఒక పోస్టు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన అసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు ఫారం పూర్తిచేసి ఈనెల 13నుంచి 16వ తేదీ దరకు సమర్పించాలని కోరారు. మెరిట్ ప్రాతిపదికన 1ః5 నిష్పత్తిలో ఈనెల 19న డెమో/ఇంటర్వ్యూలు ఉంటాయని, ఎంపికై న వారిని 20న ప్రకటిస్తామని తెలిపారు.
ప్రభుత్వ బీఈడీ కళాశాలలో..
హనుమకొండలోని ప్రభుత్వ బీఈడీ కళాశాలలో ఆరోగ్యం శారీరక విద్య ఒకపోస్టు తాత్కాలిక పద్ధతిన గెస్ట్ లెక్చరర్ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ రంగయ్యనాయుడు తెలిపారు. ఈ నెల 13 నుంచి 16వరకు ఎంపీఈడీ కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
హన్మకొండ: మహిళా కాంగ్రెస్ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలిగా పునర్నియామకమైన బంక సరళ గురువారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కలాంబ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పాల్గొన్నారు.
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని మూడు తెలంగాణ మోడల్ స్కూళ్లలో అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో వివిధ పోస్టుల నియామకానికి ఇటీవల అధికారులు ప్రకటన విడుదల చేయగా భారీగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలోని కమలాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలం ముల్కనూరు మోడల్ స్కూళ్లలో కంప్యూటర్ బోధన, ఆర్ట్, యోగా టీచర్లు, లైబ్రేరియన్ పోస్టులు మొత్తం 12 ఉండగా గురువారంతో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. కంప్యూటర్ టీచర్ పోస్టులకు 372, లైబ్రేరియన్ – 308, ఆర్ట్ టీచర్ – 32, యోగాటీచర్ – 24 మొత్తంగా 736 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి నియామక ప్రక్రియ ఎప్పుడు పూర్తి చేస్తారన్నది ఇంకా ప్రకటించలేదు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల 5, 6వ సెమిస్టర్ల పరీక్షలు, ఐదేళ్ల లా కోర్సు 9, 10 సెమిస్టర్ల అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగుతున్నాయి. గురువారం యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల సెంటర్‌ను పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. ఆయన వెంట ఆ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహాచారి ఉన్నారు.


