బీమా.. లేదు ధీమా ! | - | Sakshi
Sakshi News home page

బీమా.. లేదు ధీమా !

Nov 13 2026 8:27 AM | Updated on Nov 13 2026 8:27 AM

హన్మకొండ: రైతుబీమా పథకం నిలిచిపోవడంతో హనుమకొండ జిల్లాలోని బాధిత కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. 2018లో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని తీసుకొచ్చింది. జిల్లాలో 2025 వరకు 3,360 మంది రైతులు మరణించగా ఆ బాధిత కుటుంబాలకు రూ.168 కోట్ల సాయాన్ని అందించారు. 18 నుంచి 59 ఏళ్ల వయస్సు ఉన్న అర్హులైన రైతులకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించేది. ప్రతి సంవత్సరం ఆగస్టు 14న ఎల్‌ఐసీకి ప్రీమియం చెల్లించి పునరుద్ధరిస్తూ వచ్చింది. రైతు మరణించిన వారం నుంచి పది రోజుల్లో నామిని బ్యాంకు ఖాతాలో రూ.5 లక్షలు జమయ్యేవి. 2026 ఆగస్టు 13 వరకు పథకం కొనసాగింది. ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడంతో ఆగస్టు 14 నుంచి రైతుబీమా పథకం నిలిచిపోయింది. మూడు నెలల్లో ఇప్పటి వరకు జిల్లాలో 80 మంది రైతులు చనిపోయారు. దీంతో ఆర్థిక సాయం అందక రైతు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం సూచించిన మేరకు బీమా పథకం నిలిచిపోయిన రైతుల వివరాలను వ్యవసాయ అధికారులు సేకరిస్తున్నారు.

కొత్త బీమా పథకంపై

కరువైన స్పష్టత..

కొత్త బీమా పథకం అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఏ బీమా కంపెనీ ద్వారా పథకం అమలు చేస్తారు, ప్రీమియం చెల్లింపు ఎలా ఉంటుంది, అందించే సాయం ఎంత, ఎప్పటి నుంచి అమలు చేస్తారు అనే అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ప్రీమియం చెల్లించకుండా క్లెయిమ్స్‌ ఎలా సాధ్యమవుతుందని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. చనిపోయిన వారికి ప్రత్యేక నిధులు కేటాయించి సాయం అందించాలని రైతు కుటుంబాలు కోరుతున్నాయి.

ఆగస్టు 14వ తేదీన నిలిచిపోయిన రైతుబీమా పథకం

హనుమకొండ జిల్లాలో 80 మంది రైతుల మృతి

సాయం కోసం బాధిత కుటుంబాల ఎదురుచూపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement