కోటి కష్టాలు | - | Sakshi
Sakshi News home page

కోటి కష్టాలు

Nov 12 2026 5:24 AM | Updated on Nov 12 2026 5:24 AM

కలెక్టరేట్‌ నిర్వహణ పెండింగ్‌ బకాయిలు

కలెక్టరేట్‌ నిర్వహణ పెండింగ్‌ బకాయిలు

ఖర్చులు ఇలా..

● హౌస్‌కీపింగ్‌, పారిశుద్ధ్య నిర్వహణకు నెలకు రూ.1.50 లక్షలు, చిన్నచిన్న మరమ్మతులు, ప్లంబింగ్‌ తదితర పనులకు అదనంగా నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చవుతోంది.

● రెండు లిఫ్ట్‌ల నిర్వహణకు ఏడాదికి సుమారు రూ.1.50 లక్షలు వెచ్చిస్తున్నారు.

● కలెక్టరేట్‌ ప్రాంగణంలో మొత్తం మూడు బోర్లు ఉన్నాయి. వీటి నుంచి మూడు మోటార్ల ద్వారా ఉదయం 7:30 నుంచి సాయంత్రం 7:30 గంటల వరకు అవసరమైన నీటిని పంపింగ్‌ చేస్తున్నారు. ఇందులో కరెంటు బిల్లు కూడా ఉంటుంది.

● 32 ప్రభుత్వ కార్యాలయాలనుంచి రాని రుసుములు

● అన్ని శాఖలు సకాలంలో

చెల్లిస్తేనే మెరుగైన సేవలు

● ఇలా అయితే నిర్వహణ సాగేదెలా అంటున్న అధికారి

హన్మకొండ అర్బన్‌ : హనుమకొండ జిల్లా పరిపాలనకు కేంద్ర బిందువుగా ఉన్న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 32 ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో కొనసాగుతుండగా.. పరిశుభ్రత, పచ్చదనం, విద్యుత్‌, నీటి సరఫరా, మరమ్మతులు, ఇతర మౌలిక వసతుల నిర్వహణకు నిరంతరం నిధులు వెచ్చించాల్సి వస్తోంది. కార్యాలయాలకు కేటాయించిన విస్తీర్ణం ఆధారంగా నిర్ణయించిన నిర్వహణ రుసుములు చెల్లించడం లేదు. ఇలా.. సుమారు రూ.కోటివరకు బకాయిలు పేరుకుపోయాయి. దీంతో నిర్వహణ బాధ్యతలు చూస్తున్న సిబ్బందికి ఆర్థికంగా ఇబ్బందులుఎదురవుతున్నట్లు చెబుతున్నారు.

ఏడు ఎకరాల్లో ఐడీఓసీ..

32 కార్యాలయాలు

హనుమకొండ కలెక్టరేట్‌ సముదాయం మొత్తం 7 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో సుమారు 4 ఎకరాలు పచ్చదనం, అంతర్గత రహదారులకు కేటాయించగా.. మిగిలిన స్థలంలో కార్యాలయ భవనాలు ఉన్నాయి. మూడు అంతస్తుల భవనంలో 32 ప్రభుత్వ శాఖల కార్యాలయాలతోపాటు నాలుగు సమావేశ మందిరాలు ఉన్నాయి. కలెక్టరేట్‌లోని కార్యాలయాలు, పరిసరాల పరిశుభ్రత కోసం కాంట్రాకు ్ట పద్ధతిలో 15 మందితో హౌస్‌కీపింగ్‌ బృందాన్ని ఏర్పాటు చేశారు. వీఐపీ, వీవీఐపీ, సాధారణ సందర్శకుల కోసం కలిపి మొత్తం 18 మరుగుదొడ్లు ఉన్నాయి. వీటి శుభ్రత కోసం ప్రత్యేకంగా ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. ఇక.. అవసరమైన విద్యుత్‌, ఐటీ సహాయక సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు. వీరికి వేతనాలు కూడా నిర్వహణ ఖర్చులో నుంచి ఇవ్వాల్సి ఉంటుంది.

మిగతా శాఖల కార్యాలయాలు రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు బకాయిలున్నాయి.

చదరపు అడుగుకు రూ.3..

కలెక్టరేట్‌లోని ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించిన విస్తీర్ణం ఆధారంగా చదరపు అడుగుకు రూ.3 చొప్పున నిర్వహణ రుసుము నిర్ణయించారు.

ఆయా శాఖలు తమకు కేటాయించిన మొత్తం కార్యాలయ విస్తీర్ణానికి అనుగుణంగా ఈ మొత్తాన్ని చెల్లించాలి.

ఈ ఖర్చులన్నీ నిర్వహణ నిధులపైనే ఆధారపడి ఉంటాయి.

32 శాఖలకు సంబంధించి సుమారు కోటి రూపాయల వరకు బకాయిలు పేరుకుపోయినట్లు తెలుస్తోంది. వీటి లో కొన్ని ఏడాదికాలంగా, మరికొన్ని కలెక్టరేట్‌ ప్రారంభంనుంచి నిర్వహణ రుసుములు చెల్లించడం లేదు.

తమ వాటా రుసుములను చెల్లిస్తేనే వసతుల కల్పనకు ఇబ్బంది ఉండదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement