కాశిబుగ్గ : వరంగల్ జిల్లాలో పీసీపీఎన్డీటీ చట్టం అమలుపై ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ కేంద్రాల్లో అధికారుల కమిటీ సభ్యులు బుధవారం తనిఖీలు చేపట్టారు. కాశిబుగ్గ, ఎల్బీ నగర్, గాయత్రి కాలనీ ఏరియాలోని ఏడు ప్రైవేట్ ఆస్పత్రులతో పాటు స్కానింగ్ కేంద్రాలను ఆర్డీఓ సుమ, డీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎంహెచ్ఎన్ ప్రోగ్రాం ఆఫీసర్ సాజిదా, అభ్యుదయ సేవా సమితి అధ్యక్షుడు మండల పరశురాములు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్కానింగ్ కేంద్రాల్లో రికార్డులు, రిజిస్టర్లు, యంత్రాల నిర్వహణ, నిబంధనలు పరిశీలించారు. అనంతర కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించకూడదని, శిశువుల వివరాలను కుటుంబ సభ్యులకు వెల్లడించొద్దని సూచించారు.


