పారిశుద్ధ్య నిర్వహణను పర్యవేక్షించాలి | - | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్య నిర్వహణను పర్యవేక్షించాలి

Nov 12 2026 5:24 AM | Updated on Nov 12 2026 5:24 AM

పారిశుద్ధ్య నిర్వహణను పర్యవేక్షించాలి

జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ టి.వెంకన్న

వరంగల్‌ అర్బన్‌ : నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో గడువులోగా పూర్తి చేయాలని గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పారిశుద్ధ్య నిర్వహణను నిత్యం పర్యవేక్షించాలని సూచించారు. బుధవారం కమిషనర్‌ గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని హనుమకొండ, వరంగల్‌ ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనులు, పూర్తయిన పనులు, పారిశుద్ధ్య నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

వడ్డేపల్లి బండ్‌పై ఫుడ్‌ స్ట్రీట్‌ పనుల పరిశీలన

హనుమకొండలోని వడ్డేపల్లి బండ్‌పై చేపడుతున్న సుందరీకరణ పనులను కమిషనర్‌ పరిశీలించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఫుడ్‌ స్ట్రీట్‌ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. హనుమకొండ బస్టాండ్‌ పరిసరాలను పరిశీలించిన కమిషనర్‌ పారిశుద్ధ్య నిర్వహణను సమీక్షించి అక్కడి మురుగు కాల్వను పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపేందుకు అవసరమైన పనుల ప్రతిపాదనలు సమర్పించాలని ఇంజనీరింగ్‌ అధికారులకు సూచించారు. అనంతరం ఏనుమాముల మార్కెట్‌ సమీపంలోని బాలాజీ జంక్షన్‌ వద్ద పూర్తయిన అభివృద్ధి పనులను పరిశీలించారు. వరంగల్‌లోని గోవిందరాజులగుట్ట ప్రాంతంలో నిర్మిస్తున్న వాటర్‌ ట్యాంక్‌ పనులను, స్వచ్ఛ ఆటోను తనిఖీ చేసి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్న తీరును పరిశీలించారు. డ్రైవర్‌ నిర్వహిస్తున్న లాగ్‌బుక్‌ను తనిఖీ చేసి, ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ వివరాలను నమోదు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. సీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాజారెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు సంజయ్‌ కుమార్‌, ఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాజేష్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సూపర్‌వైజర్లు, డీఈలు, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement