మార్కెట్‌కు వరుస సెలవులు | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌కు వరుస సెలవులు

Nov 6 2026 2:32 AM | Updated on Nov 6 2026 2:32 AM

ఇద్దరు సబ్‌ ట్రెజరీ ఉద్యోగులపై బదిలీ వేటు

ఖిలా వరంగల్‌ : దీపావళి పండుగ సందర్భంగా వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మా ర్కెట్‌కు మూడు రోజులు సెలవులు ప్రకటించారు. ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు మార్కె ట్‌ బంద్‌ ఉంటుందని మార్కెట్‌ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి శ్రీనివాస్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 7న నరక చతుర్ధశి, 8న దీపావళి, 9న అమావాస్య సందర్భంగా మార్కెట్‌కు సెలవులు ప్రకటించినట్లు పేర్కొన్నారు. 10వ తేదీన మార్కెట్‌ కార్యకలా పాలు యథావిధిగా ప్రారంభమవుతాయని వెల్లడించారు. సెలవు రోజుల్లో రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్‌కు తీసుకొచ్చి ఇబ్బందులకు గురికావొద్దని సూచించారు. మార్కెట్‌ బంద్‌ విషయాన్ని రైతులు, వ్యాపారులు, గుమస్తాలు, దడవాయిలు, కార్మికులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.

న్యూశాయంపేట: నర్సంపేట డివిజనల్‌ సబ్‌ ట్రెజరీలో లంచం డిమాండ్‌, ఉద్యోగుల వేధింపులపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు ఉద్యోగులపై చర్యలకు కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఉన్నతాధికారులకు సిఫారసు చేశారు. కాగా, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. విచారణ నివేదిక ఆధారంగా నర్సంపేట డివిజనల్‌ సబ్‌ ట్రెజరీ అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌ (ఏటీఓ) బి.చంద్రకళను కరీంనగర్‌కు, సీనియర్‌ అకౌంటెంట్‌ అలేఖ్యను భద్రాద్రి కొత్తగూడం జిల్లాకు బదిలీ చేస్తూ డైరెక్టర్‌ ఆప్‌ ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌ కె.పార్వతీదేవి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు సబ్‌ ట్రెజరీ ఆఫీసర్‌ మహ్మద్‌ రఫీని నర్సంపేట ఏటీఓగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కల్తీకారం, పసుపు పట్టివేత

● వ్యాపారి అరెస్ట్‌

● రూ.5.92 లక్షల విలువైన

సరుకు స్వాధీనం

కాశిబుగ్గ : కారం, పసుపు పొడి తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించి రూ.5.92 లక్షల విలువైన కల్తీ సరుకు స్వాధీనం చేసుకుని వ్యాపారిని అరెస్ట్‌ చేసినట్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. కరీమాబాద్‌కు చెందిన ఆకుతోట గోపి వరంగల్‌ మట్టెవాడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పాతబీట్‌ బజారులో కారం, పసుపు పొడి తయారీ కేంద్రం నిర్వహిస్తున్నాడు. అయితే ఇందులో కల్తీ జరుగుతోందని టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ మధుసూదన్‌కు సమాచారం అందింది. దీంతో ఆయన ఆదేశాల మేరకు ఇన్‌స్పెక్టర్‌ వి.క్రాంతికుమార్‌, ఎస్సై కె.సుధాకర్‌ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఇందులో ఫుడ్‌ సేఫ్టీ లైసెన్స్‌ లేకుండా కేంద్రం నిర్వహించడం, సరైన లేబుల్స్‌ లేకుండా ప్యాకింగ్‌ చేయడం, అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేసి ప్యాకింగ్‌ చేయడాన్ని గుర్తించారు. దీంతో గోపిని అరెస్ట్‌ చేసి రూ.5,92,500 విలువైన 2,250 కిలోల కల్తీ కారం, పసుపు పొడిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 600 కిలోల కారం, 1,650 కిలోల పసుపు పొడి ఉన్నట్లు గుర్తించారు.

బైక్‌ అదుపు తప్పి

రైల్వే ఉద్యోగి మృతి

కాజీపేట : బైక్‌ అదుపు తప్పిన ఘటనలో ఓ రైల్వే ఉద్యోగి మృతి చెందాడు. ఈ ఘటన కాజీపేట ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. కాజీపేట 62వ డివిజన్‌ రహమత్‌నగర్‌ కాలనీకి చెందిన ఎం.డి ఎబి ఫాయాజ్‌ (37) రైల్వే ఉద్యోగి. ఈ క్రమంలో ఇటీవల తన మిత్రుడు, రైల్వే ఉద్యోగి దూలం శ్రీనివాస్‌ మృతి చెందాడు. అదే ఆవేదనలో ఉన్న ఫాయాజ్‌ బుధవారం రాత్రి బైక్‌పై ఇంటికి వెళ్తూ అదుపు తప్పి రహదారిపై పడ్డాడు. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement