మంగళవారం శ్రీ 22 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

మంగళవారం శ్రీ 22 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

Sep 22 2026 1:00 AM | Updated on Sep 22 2026 1:00 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

ఐసీఎస్‌యూ వార్డులో..

కాశిబుగ్గ: ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆనాడు ఎంతో అందంగా కనిపించిన ఎంజీఎం ఆస్పత్రి భవనాల సముదాయం నేడు శిథిలావస్థకు చేరింది. అధికారులు సకాలంలో శాశ్వత మరమ్మతు పనులు చేయకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని పలువురు పేర్కొంటున్నారు. పెద్దాస్పత్రి కావడం, పేషంట్ల రద్దీ పెరగడంతో అధికారులు పాత భవనంలోని వార్డుల్లో పేషంట్లకు చికిత్స అందిస్తున్నారు. దురదృష్టవశాత్తు పేషంట్లకు ప్రమాదం జరిగినప్పుడే అధికారులు స్పందిస్తూ చర్యలు తీసుకోవడం తప్ప శాశ్వత మరమ్మతుల జోలికి వెళ్లకపోవడంతో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని రోగుల అటెండెంట్లు ఆందోళన చెందుతున్నారు. తాజాగా, ఆదివారం ఎంజీఎంలోని ఆరోగ్యశ్రీ వార్డులో జరిగిన సీలింగ్‌ ఊడిన ఘటనలో పేషంట్లు, అటెండెంట్లు, శానిటేషన్‌ సిబ్బంది గాయపడ్డారు. సోమవారం సాక్షి మెయిన్‌లో ‘సీలింగ్‌ పెచ్చులు ఊడాయి’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీంతో రాష్ట్రస్థాయిలో ఉన్న వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ చోంగ్త్‌, డీఎంఈ వాణి, వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద సోమవారం కదిలివచ్చారు. ఆరోగ్యశ్రీ వార్డులో జరిగిన సంఘటన వివరాలపై ఆరా తీశారు.

బర్న్స్‌ వార్డులో

కరువైన ఏసీలు..

పాత భవనంలోని ఆరోగ్యశ్రీ వార్డుతో పాటు మరికొన్ని వార్డులు కూడా శిథిలావస్థ దశకు చేరుకుంటున్నాయి. అలాగే, కొన్ని వార్డుల్లో సీలింగ్‌ పెచ్చులు ఊడిపోయే దుస్థితి నెలకొంది. ఓ వార్డు వాష్‌ వద్ద స్లాబ్‌ పైనుంచి నెలరోజుల నుంచి నీళ్లు కారుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. ముఖ్యంగా ఎంజీఎం సూపరింటెండెంట్‌ పాత చాంబర్‌ పక్కనే ఉన్న బర్న్స్‌ వార్డుపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అసలే కాలిన గాయాలతో బాధపడుతున్న పేషంట్లకు ఏసీలు లేకపోగా, ఉన్న వసతులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఓ వార్డులో అయితే సీలింగ్‌ పెచ్చులు ఊడి ఉన్నాయి. పక్కనే ఫ్యాన్‌ తిరుగుతుంది. దీంతో మిగిలిన పెచ్చులు పేషంట్లపై పడిపోయే ప్రమాదం నెలకొంది. అలాగే, ఐసీఎస్‌యూ వార్డులో పేషంట్ల రద్దీ ఎక్కువగా ఉంటుంది. పోస్ట్‌ ఆపరేటివ్‌ వార్డు కావడంతో పేషంట్లు నడవలేని పరిిస్థితి ఉంటుంది. ఇందులో చికిత్స పొందుతున్న ఇద్దరు పేషంట్ల వద్ద సీలింగ్‌ పెచ్చులు ఊడి ఉన్నా అఽధికారులు పట్టించుకోవడం లేదు. వార్డు సిబ్బంది అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేకపోయిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక న్యూ మెడికల్‌ వెస్ట్‌, మేల్‌ సర్టికల్‌ ఈస్ట్‌, మేల్‌ సర్జికల్‌ వెస్ట్‌ వార్డుల పరిస్థితి కూడా అధ్వానంగా మారింది. పక్కనే ఉన్న వాష్‌రూంలు, ఓ బాతురూం వద్ద నెలరోజుల పైనుంచి స్లాబ్‌ లీకేజీతో నీళ్లు కారుతున్నా పట్టించుకునేవారు కరవయ్యారని విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రాంతం దారుణంగా నడవలేని పరిస్థితి ఉన్నా ఎవరూ కన్నెత్తి చూడడం లేదని అటెండెంట్లు ఆరోపిస్తున్నారు. అలాగే, ఎంఆర్‌డీలో కూడా కొన్ని గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. కాగా, ఆరు నెలల క్రితం ఏఎంసీ వార్డు వరండా నుంచి వెళ్తున్న స్వీపర్‌ తలపై పెచ్చులూడి గాయపడగా కుట్లు వేయించుకోవాల్సి వచ్చింది.

మేల్‌ సర్జికల్‌ వార్డు సమీపంలోని వాష్‌ రూం వెళ్లే మార్గంలో నీటి లీకేజీ,

మేల్‌ సర్జికల్‌ వార్డు పక్కన పగుళ్లు వచ్చిన గోడ

బర్న్స్‌ వార్డులో ఊడిన స్లాబ్‌ పెచ్చులు

ఎంజీఎంలో శిథిలావస్థకు చేరిన పలు విభాగాలు

అధ్వానంగా ఐసీఎస్‌యూ, బర్న్స్‌, మేల్‌ సర్జికల్‌ వార్డులు పాత భవనాల్లో భయంభయంగా రోగులు, అటెండెంట్లు

ప్రమాదం జరగకముందే

చర్యలు తీసుకోండి..

పేషంట్లకు, అటెండెంట్లకు, సిబ్బందికి ప్రమాదాలు జరగకముందే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ఉరుకులు, పరుగుల మీద వచ్చిన అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అధికారులు పేషంట్ల భద్రత కోసం అన్ని వార్డులు పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement