హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్‌ను నమ్ముకుని పనిచేస్తున్న పీస్ వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని, సబ్‌స్టేషన్ నిర్మాణాలకు భూములు ఇచ్చిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (టీయూఈఈయూ) రాష్ట్ర అధ్యక్షుడు కె.ఈశ్వర్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట బిల్ కలెక్టర్లు, స్పాట్ బిల్లర్లు, ఎస్‌పీఎం కార్మికులు, అన్‌మ్యాన్డ్ వర్కర్లు ధర్నా చేశారు. ముందుగా పబ్లిక్ గార్డెన్ నుంచి ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వరకు ధర్నా చేశారు. అనంతరం హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ సి.ప్రభాకర్, ఫైనాన్స్ డైరెక్టర్ వి.తిరుపతిరెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహజ్యోతి, ఆన్‌న్‌లైన్ చెల్లింపుల కారణంగా బిల్ కలెక్టర్ల ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో నెలకు రూ.12 వేల నుంచి రూ.14 వేల వరకు ఆదాయం వచ్చేదని, ప్రస్తుతం రూ.3 వేల నుంచి రూ.4 వేలకే పరిమితమైందని తెలిపారు. జీఓ ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ హనుమకొండ జిల్లా కార్యదర్శి రాగుల రమేశ్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఎన్.స్వామి, ఎస్.చంద్రారెడ్డి, ఆంజనేయులు, ఎం.ప్రసాద్, శ్రీనివాస్, టి.రేఖ, డి.వీరన్న, డి.సదానందం, సోమేశ్, సందీప్‌రెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు.
టీయూఈఈయూ రాష్ట్ర అధ్యక్షుడు
కె.ఈశ్వర్‌రావు


