అర్జీలు త్వరగా పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

అర్జీలు త్వరగా పరిష్కరించండి

Sep 22 2026 1:00 AM | Updated on Sep 22 2026 1:00 AM

అర్జీలు త్వరగా పరిష్కరించండి దరఖాస్తులు పెండింగ్‌లో ఉండొద్దు

హన్మకొండ అర్బన్‌: ప్రజావాణికి అందిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి అధికారులతో కలిసి కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, అదనపు కలెక్టర్‌ రవి అర్జీలు స్వీకరించారు. జిల్లా, రెవెన్యూ డివిజనల్‌, మండల స్థాయిలో నిర్వహించిన గ్రీవెన్స్‌ కార్యక్రమానికి మొత్తం 298 అర్జీలు అందా యి. అర్జీలను సంబంధిత శాఖల అధికారులు ఎ ప్పటికప్పుడు పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉంచకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. వర్చువల్‌ విధానంలో ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో మాట్లాడి అర్జీల పరిష్కారంపై సూచనలిచ్చారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జ్‌లు అదనపు కలెక్టర్‌ శేషాద్రి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్‌, డీఆర్డీఓ మేన శ్రీను, సీపీఓ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.

వరంగల్‌ జిల్లా అదనపు కలెక్టర్‌

ఎల్‌.కిశోర్‌కుమార్‌

243 వినతుల స్వీకరణ

న్యూశాయంపేట: ప్రజల నుంచి వచ్చిన అర్జీలు పెండింగ్‌లో ఉండొద్దని, త్వరితగతిన పరిష్కరించాలని వరంగల్‌ అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) ఎల్‌.కిశోర్‌కుమార్‌ అన్నారు. సోమవారం గ్రీవెన్స్‌లో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 243 వినతులు రాగా, అందులో రెవెన్యూకు సంబంధించి 60, జీడబ్ల్యూఎంసీ 84, గృహ నిర్మాణ శాఖ 35, ఇతర శాఖలకు సంబంధించి 64 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. సంబంధిత శాఖల దరఖాస్తులను అధికారులకు ఎండార్స్‌ చేస్తూ త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) గణేశ్‌, డీఆర్‌ఓ విజయలక్ష్మి, హౌసింగ్‌ పీడీ విష్ణువర్ధన్‌రెడ్డి అధికారులు పాల్గొన్నారు.

దరఖాస్తులు ఇలా..

కలెక్టరేట్‌లో 130 దరఖాస్తులు

ఆర్డీఓ కార్యాలయంలో 32 దరఖాస్తులు

మండల కార్యాలయాల్లో 136 దరఖాస్తులు

మొత్తం 298 దరఖాస్తులు

హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌

గ్రీవెన్స్‌కు 298 అర్జీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement