ఖిలా వరంగల్: వరంగల్ శివనగర్‌లో గణపతికి శాస్త్రోక్తంగా నిర్వహించే కనకాభిషేకం 52 ఏళ్లు పూర్తి చేసుకుంది. వాసవి కాలనీలో వినాయక ట్రస్టు ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు 1973 నుంచి ఇక్కడ మట్టి వినాయకుడిని పూజిస్తున్నారు. రూ.11తో మొదలైన కనకాభిషేకం.. నేడు కోట్ల రూపాయల నగదు కట్టల అలంకరతో గణనాథుడు పూజలందుకుంటున్నాడు. ప్రతి ఏడాది విఘ్నేశ్వరుడిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ విఘ్నేశ్వరుడికి కనక వర్షం కురిపిస్తున్నారు. కనకాభిషేకం ఘట్టం చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలి రావడం విశేషం


