నాడు..నేడు మట్టి ప్రతిమలే..
అప్పట్లో.. రూ.1,200కే
4 అడుగుల విగ్రహం
గోవిందరావుపేట: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఐదు దశాబ్దాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాల సంప్రదాయం కొనసాగుతోంది. సుమారు 50 ఏళ్ల క్రితం గ్రామస్తులు ఎడ్లబండిపై గ్రామ సమీపంలోని చెరువుకు వెళ్లి రేగడి మట్టిని తీసుకొచ్చి వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు. అప్పటి నుంచి నిర్విరామంగా ప్రతీ ఏడాది ఏటా మట్టితో తయారు చేసిన విగ్రహాలను నిర్వహిస్తున్నారు. కాకతీయుల కాలంలో నిర్మించిన రామలింగేశ్వర స్వామి ఆలయం ఒకప్పుడు జరిగిన దాడులు, ఘర్షణల కారణంగా శిథిలావస్థకు చేరుకోగా.. 2007లో ఆలయాన్ని నూతనంగా పునర్నిర్మించారు. కాలం మారుతున్నా.. ఆలయ రూపురేఖలు మారుతున్నా.. గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే సంప్రదాయాన్ని మాత్రం ఇప్పటికీ అంతే భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తూ వస్తున్నామని గ్రామానికి చెందిన వీరమాచినేని వెంకటేశ్వరరావు చెబుతున్నారు.
● అంబరాన్నంటేలా వేడుకలు
● సాంస్కృతిక కార్యక్రమాలు
● అప్పుడు సాదాసీదాగా ఇప్పుడు ఆధునిక హంగులతో..
● సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఉత్సవ కమిటీలు, భక్తులు
హన్మకొండ: హనుమకొండ అంబేడ్కర్ కూడలి (డిపో క్రాస్)లో ఏర్పాటు చేస్తున్న శ్రీ శివాజీ యువజన భక్త మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు 50వ సంవత్సరంలోకి అడుగుపెట్టాయి. ఈసారి స్వర్ణోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. 1976లో ఏబీవీపీ నాయకుడు సామా జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో శ్రీ శివాజీ యువజన భక్త మండలి ఆధ్వర్యంలో ఉత్సవాలు మొదలయ్యాయి. 12 మంది అర్చకుల వేదమంత్రోచ్ఛరణల మధ్య ఉత్సవాల్లో నిత్యం హోమం నిర్వహంచడం ఇక్కడి ప్రత్యేకత. కాగా, ఉత్సవాలు ప్రారంభించిన ఏడాది రూ.1200కే నాలుగు అడుగుల విగ్రహం లభించేదని, ఇప్పుడు రూ.65 నుంచి రూ.75 వేలు వెచ్చించాల్సి వస్తోందని నిర్వాహకులు తెలిపారు. 10 ఏళ్లుగా మట్టి విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నట్లు పి.అశోక్‌రావు, మార్తినేని ధర్మారావు, చాడా రఘునాథరెడ్డి, గుర్నాథ్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి, పరమేశ్వర్, 30 మంది సభ్యులు చెబుతున్నారు.
ఊరూవాడా ఆధ్యాత్మిక సందడి


