స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలి | - | Sakshi
Sakshi News home page

స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలి

Sep 7 2026 7:33 AM | Updated on Sep 7 2026 7:33 AM

స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలి

హసన్‌పర్తి: వినూత్న ఉత్పత్తుల తయారీ ద్వారా యువత స్వయం ఉపాధి అవకాశాలు సృష్టించుకోవాలని కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌ సూచించారు. గోపాలపురంలో అరిస్సా గ్రోత్‌ ఫామ్స్‌ మిల్లెట్‌ పన్నీర్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ప్రాసిసెంగ్‌ యూనిట్‌ను ఆదివారం కలెక్టర్‌ ప్రారంభించారు. న్యూట్రిహబ్‌ ప్రోత్సాహంతో ఉజ్వల చంద్రగిరి అనే యువతి ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్‌లో భాగంగా ఈ పరిశ్రను నెలకొల్పారు. కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. మిల్లెట్‌ ఆధారిత ఉత్పత్తుల తయారీలో ఐఐఎంఆర్‌ వంటి సంస్థల సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కాగా, ఇది దేశంలోనే తొలి మిల్లెట్‌ పన్నీర్‌ యూనిట్‌ అని నిర్వాహకులు కలెక్టర్‌కు వివరించారు. కార్యక్రమంలో ఐఐఎంఆర్‌ న్యూట్రిహబ్‌కు చెందిన డాక్టర్‌ స్టాన్లే, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ నవీన్‌కుమార్‌, న్యూట్రిహబ్‌ బృంద ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

గోపాలపురంలో మిల్లెట్‌ పన్నీరు తయారీ పరిశ్రమ ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement