వర్షాలపై అప్రమత్తంగా ఉండండి | - | Sakshi
Sakshi News home page

వర్షాలపై అప్రమత్తంగా ఉండండి

Jul 22 2026 2:23 AM | Updated on Jul 22 2026 2:23 AM

వర్షాలపై అప్రమత్తంగా ఉండండి

గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌ టి.వెంకన్న

వరంగల్‌ అర్బన్‌: వర్షాలు విస్తృతంగా కురవనున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి వింగ్‌ అధికారుల వరకు అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. నగర పరిధి లోతట్టు ప్రాంతాలైన హనుమకొండలోని తిరుమల బార్‌ జంక్షన్‌, ఎన్‌జీఓస్‌ రోడ్డు, ఎస్‌బీహెచ్‌ కాలనీ, రామకృష్ణ కాలనీ, కాకతీయ కాలనీ, వరంగల్‌లోని బొంది వాగు, శివనగర్‌, మైసయ్య నగర్‌, సాయి గణేశ్‌ నగర్‌ వడ్డేపల్లి చెరువు, 12 మోరీలు తదితర ప్రాంతాల్లో కమిషనర్‌ తనిఖీలు నిర్వహించారు. ఈసందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలవకుండా ఇంజనీరింగ్‌కు చెందిన మాన్‌ సూన్‌ టీమ్స్‌ సహకారంతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా వెంటనే తొలగించాలన్నారు. ప్రధాన రోడ్లపై శానిటేషన్‌ పక్కాగా జరిగేలా చూడాలన్నారు. ఆయన వెంట కమిషనర్‌ ముఖ్య ఆరోగ్యాధికారి డాక్టర్‌ రాజారెడ్డి, ఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాజేశ్‌, శానిటరీ సూపర్‌వైజర్‌ గోల్కొండ శ్రీను ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement