ఎమ్మెల్యేలు ఏమన్నారంటే.. | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేలు ఏమన్నారంటే..

Jul 22 2026 2:23 AM | Updated on Jul 22 2026 2:23 AM

వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రేటర్‌ వరంగల్‌లో మిషన్‌ భగీరథ పైప్‌లైన్ల లీకేజీలతో తాగునీటి సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు. తక్షణం సరిచేయాలని కోరారు.

స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు తాగునీరు, సాగునీటికి దేవాదుల ప్రాజెక్టే ప్రధాన ఆధారమని అన్నారు. మూడు దశల్లోని 10 మోటార్లను కనీసం 100 రోజులపాటు నిరంతరాయంగా నడిపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాంకేతిక లోపాలు తలెత్తితే 48 గంటల్లోపు మరమ్మతులు పూర్తి చేయాలని సూచించారు.

వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌.నాగరాజు మాట్లాడుతూ హసన్‌పర్తి మండలంతోపాటు విలీన గ్రామాల్లో తాగునీటి సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు. వర్ధన్నపేటలో అమృత్‌ పథకం పనులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ తక్కువ నీటితో అధిక ఆదాయం వచ్చే వాణిజ్య పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. దేవాదుల ప్రాజెక్టు, భీమ్‌ఘనపూర్‌, చలివాగు తదితర నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ ఎరువుల సరఫరాపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.

మహబూబాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ భూక్యా మురళీనాయక్‌ మాట్లాడుతూ మహబూబాబాద్‌ పట్టణంలో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఉన్నాయని, ముఖ్యంగా మెడికల్‌ కాలేజీకి ప్రత్యామ్నాయ వనరుల ద్వారా నీరు అందించాలని కోరారు. డ్రిప్‌ ఇరిగేషన్‌పై రైతులకు అవగాహన కల్పించి కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు.

సమీక్షలో పాల్గొన్న ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ రాజయ్య, ఎమ్మెల్సీ సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దొంతి మాధవరెడ్డి, నాగరాజు, మురళీనాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement