టీఎన్‌ఎస్‌ ముంబైతో ఎంఓయూ | - | Sakshi
Sakshi News home page

టీఎన్‌ఎస్‌ ముంబైతో ఎంఓయూ

Jul 22 2026 2:23 AM | Updated on Jul 22 2026 2:23 AM

టీఎన్‌ఎస్‌ ముంబైతో ఎంఓయూ ఉగ్ర, శివదూతీ క్రమాల్లో భద్రకాళి అమ్మవారు బెటాలియన్‌ను సందర్శించిన ఏడీజీపీ

కేయూ క్యాంపస్‌: టీఎన్‌ఎస్‌ ముంబై ఇండియా ఫౌండేషన్‌తో హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్‌ సైన్స్‌ కళాశాల ఎంఓయూ మంగళవారం కుదుర్చుకుంది. ఈ ఎంఓయూతో ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల విద్యార్థులకు ఆ ఫౌండేషన్‌ ఉచితంగా 200 గంటల ఉచిత శిక్షణ ఇవ్వనుందని ఆకళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.జ్యోతి తెలిపారు. సరైన కేరీర్‌ ఆప్షన్‌, కమ్యూనికేషన్‌ ప్రొఫెషనల్‌ స్కిల్స్‌తో పాటు అప్‌లై ఎ జాబ్‌, టూల్స్‌, కవరింగ్‌ లెటర్‌, మాక్‌ ఇంటర్వూలపై, అనేక నైపుణ్యాలు పెంచేందుకు ఆ ఫౌండేషన్‌ సహకారం అందించనుందని తెలిపారు. కార్యక్రమంలో ఆకళాశాల ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ సెల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఎల్‌.జితేందర్‌, ఏఆర్‌ శ్రీలత, కామర్స్‌ విభాగం అధ్యాపకుడు డాక్టర్‌ స్వామి, డాక్టర్‌ ప్రసాద్‌, డాక్టర్‌ గిరిప్రసాద్‌, టీఎన్‌ఎస్‌ ముంబై ప్రతినిధులు ఆ మేనేజర్‌ కమ్‌ ట్రైనర్స్‌ సౌరవ్‌ పాండే, దేవిక, ఎస్‌.దీపు తదితరులు పాల్గొన్నారు.

హన్మకొండ కల్చరల్‌: భద్రకాళి ఆలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు మంగళవారం అమ్మవారిని ఉగ్ర, శివదూతీ క్రమాల్లో అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుంచి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం స్నపనమూర్తిని కాళీక్రమంలో ఉగ్రమాతగా, బోగభేరాన్ని షోడశీక్రమంలో శివదూతీమాతగా అలంకరించి పూజలు నిర్వహించారు. వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. వరంగల్‌ పోలీస్‌ కమీషనర్‌ శ్వేతరెడ్డి, డోర్నకల్‌ ఎమ్మెల్యే జాటోత్‌ రాంచంద్రునాయక్‌ అమ్మవారిని దర్శించుకున్నారు.

మామునూరు: వరంగల్‌ మామునూరు టీజీఎస్పీ నాలుగో బెటాలియన్‌ను మంగళవారం సాయంత్రం అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ సంజయ్‌కుమార్‌ జైన్‌ సందర్శించారు. ఈసందర్భంగా కమాండెంట్‌ శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది ఏడీజీపీకి గౌరవ వందనం సమర్పించి ఘన స్వాగతం పలికారు. అనంతరం బెటాలియన్‌ ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. అనంతరం మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీస్‌ ఆవరణలో నూతనంగా నిర్మించిన ఎల్‌ఎంవీ హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ షెడ్‌, వీల్‌ ఆలైన్మెంట్‌, టైర్‌ చేంజర్‌ షెడ్‌, దోబీ రూమ్‌లను ఆయన ప్రారంభించారు. అనంతరం బెటాలియన్‌ అధికారులతో సమావేశమయ్యారు. ఏసీ బాలయ్య, వీరన్న, రాజేందర్‌, ఆర్‌ఐలు సురేశ్‌, బాబు, విజయ్‌, రాజిరెడ్డి, రవి, పురుషోత్తంరె డ్డి, సర్వర్‌, వెంకటేశ్వర్లు, రాజ్‌కుమార్‌, రామ్‌ప్రసాద్‌, కృష్ణ, అధికారులు ఉన్నారు.

నెక్కొండ ఎస్సై మహేందర్‌

సస్పెన్షన్‌

నెక్కొండ: సివిల్‌ వివాదంలో జోక్యం, పీఎస్‌కు వచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయని కారణంగా నెక్కొండ ఎస్సై మహేందర్‌ను సస్పెండ్‌ చేస్తూ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్వేత మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన గాడ్దుల వెంకన్న.. నెక్కొండ తండాకు చెందిన బోడ అనిల్‌, బానోతు వాగ్యాకు రూ.50 వేలు గొర్రెల డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఈవిషయంలో తలెత్తిన వివాదం కారణంగా వెంకన్నకు చెందిన 90 గొర్రెలు, మేకలను వీరు తోలుకెళ్లారు. దీంతో వెంకన్న పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. అనిల్‌, వాగ్యాకు అనుకూలంగా ఎస్సై వ్యవహరించి తాను చెప్పినట్లు వినాలని, లేదంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తానని వెంకన్నను బెదిరించాడనే ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement