కాశిబుగ్గ: వరంగల్‌లోని గ్రంథాలయాన్ని ఈ–గ్రంథాలయంగా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆదివారం కాశిబుగ్గ ఓ సిటీలో వరంగల్ జిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్‌గా మీసాల ప్రకాశ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా మంత్రి పాల్గొని మాట్లాడారు. పార్టీలో పనిచేస్తున్న సీనియర్ నాయకుడైన మీసాల ప్రకాశ్‌కు గౌరవం కల్పిస్తూ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా అవకాశం కల్పించిన సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. వరంగల్ గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని, ముందుగా ఈ–లైబ్రేరీగా తయారు చేయాలని ఇందుకు కావాల్సిన కంప్యూటర్లను సీఎస్‌ఆర్ ద్వారా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఇప్పటి నుంచే ప్రతీ కార్యకర్త కష్టపడి పనిచేయాలని, మేయర్ పీఠం కై వసం చేసుకోవడానికి ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయాలన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు ద్వారా తెలుసుకుంటున్నానని, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు గోపాల నవీన్‌రాజు, గ్రంథాలయ సెక్రటరీ బుగ్గారెడ్డి, చినబాబు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా మీసాల ప్రకాశ్ ప్రమాణ స్వీకారం


