జాతీయ స్థాయి పారా తైక్వాండోలో సత్తా | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి పారా తైక్వాండోలో సత్తా

Jul 13 2026 4:31 AM | Updated on Jul 13 2026 4:31 AM

వరంగల్‌ స్పోర్ట్స్‌ : పుణెలోని శివ చత్రపతి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ఈ నెల 10, 11వ తేదీల్లో జరిగిన 5వ పారా తైక్వాండో ఓపెన్‌ జాతీయ చాంపియన్‌షిప్‌ (క్యోరుగి – పూమ్సే) లో తెలంగాణ పారా తైక్వాండో జట్టు ప్రతిభ కనబరిచి ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ కై వసం చేసుకుంది. మొత్తం 9 పతకాలు సాధించగా, అందులో 4 స్వర్ణం, 2 రజత, 3 కాంస్య పతకా ల ఉన్నాయి. గౌతమ్‌యాదవ్‌, కె.లోకేశ్వరి, కె.శివ, జి.రాజేశ్‌ స్వర్ణం, నర్సింహ, డి.సాయిబాబా రజ తం, అబ్దుల్‌, రమేశ్‌, సక్కుబాయి కాంస్య పతకాలు సాధించారు. ఈ సందర్భంగా ఇండియా తైక్వాండో పారా చైర్‌పర్సన్‌ వీణ, తెలంగాణ పారా తైక్వాండో అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎన్‌.ఎస్‌. దిలీప్‌, ప్రధాన కార్యదర్శి గణేశ్‌ యాదవ్‌ విజేతలను అభినందించారు. క్రీడాకారులు చూపిన కృషి, క్రమశిక్షణ, అంకితభావాన్ని ప్రశంసిస్తూ, కోచ్‌లు, అధికారులు, సహాయక సిబ్బంది సేవలను కొనియాడారు. తెలంగాణ పారా తైక్వాండో అసోసియేషన్‌.. ఈ విజయానికి సహకరించిన కోచ్‌లు, అధికారులు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపింది.

ఓవరాల్‌ చాంపియక్‌ షిప్‌ సాధించిన తెలంగాణ జట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement