● ఏఐసీసీ జనరల్ సెక్రటరీ
బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెట్‌బాల్
అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి
వరంగల్ స్పోర్ట్స్: యువత క్రీడలను జీవనశైలిలో భాగం చేసుకోవాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా యువజన, క్రీడల అధికారి కొత్త ప్రశాంత్ అధ్యక్షతన జవహర్‌లాల్ నెహ్రూ (జేఎన్‌ఎస్) స్టేడియంలో ఆదివారం క్రీడల ప్రాధాన్యం, శాసీ్త్రయ శిక్షణ, గాయాల నివారణ, ఫిట్‌నెస్, వార్మ్‌అప్, కూల్‌డౌన్ అంశాలపై ఆదివారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వారు హాజరై మాట్లాడుతూ క్రీడాకారులకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. డీవైఎస్‌ఓ కొత్త ప్రశాంత్ మాట్లాడుతూ క్రీడాకారులు శాసీ్త్రయ శిక్షణను అలవర్చుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. ఇలాంటి అవగాహన సదస్సులు క్రీడాకారులకు ఎంతో ఉపయోగపడతాయని, భవిష్యత్‌లో కూడా మరిన్ని శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. నిపుణులు క్రీడాకారులకు సరైన వార్మ్‌అప్, డైనమిక్ వ్యాయామాలు, అజిలిటీ శిక్షణ, శ్వాస నియంత్రణ, గాయాల నివారణ, ఫస్ట్ ఎయిడ్, సీపీఆర్, రికవరీ పద్ధతులు, పోటీలకు ముందు తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రత్యక్ష ప్రదర్శనలతో వివరించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ తరఫున అథ్లెటిక్స్ కోచ్ శ్రీనివాస్, బాస్కెట్ బాల్‌కోచ్ సైదులు, క్రికెట్ కోచ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


