కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే కోచ్‌ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులు, రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పూర్తి చేసిన వారికి, కాజీపేట పరిసర గ్రామాల వారికి, ఉమ్మడి వరంగల్ జిల్లా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరుతూ ఈ నెల 19వ తేదీన మడికొండ అంబేడ్కర్ విగ్రహం నుంచి కాజీపేట రైల్వే స్టేషన్ వరకు శాంతి యుత పాదయాత్ర చేపడుతున్నట్లు రైల్వే జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్, ప్రజాసంఘాల ఐక్యవేదిక కార్యదర్శి ఎం. చుక్కయ్య తెలిపారు. ఈ మేరకు ఆదివారం కాజీపే ట రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ ఎంట్రెన్స్ ఎదుట శాంతియుత పాదయాత్ర కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రైల్వే జేఏసీ చైర్మన్ కోండ్ర నర్సింగరావు మాట్లాడుతూ 40 ఏళ్ల ఆకాంక్ష కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు కోసం మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. నాయకులు మద్దెల మల్లేశ్, జనగామ కుమారస్వామి, కె.రంజి త్, జెరిపోతుల విల్సన్, ఎన్.రాజమౌళి, కారు ఉ పేందర్, కందుల సంగమయ్య, అనుమాల శ్రీనివా స్, పి.రమేశ్, ఎం.మహేశ్, వి.తిరుపతి, ఎస్.రమేశ్, అయోధ్యపురం గ్రామస్తులు మేరుగు రాజయ్య, ఇలాసాగరం ప్రదీప్, జి. నరేందర్, డి. తేజ, ఎం. అనిల్‌కుమార్, ఇ.సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
రైల్వే జేఏసీ, ప్రజాసంఘాల
ఐక్యవేదిక పిలుపు


