ముంపు నివారణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

ముంపు నివారణకు చర్యలు

Jul 8 2026 1:20 AM | Updated on Jul 8 2026 1:20 AM

వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

ఖిలావరంగల్‌: శివనగర్‌లోని మైసయ్యనగర్‌ వరద నీటి నిల్వ సమస్య నివారణకు చేపడుతున్న చర్యలను వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక పరిస్థితులను పరిశీలించిన కలెక్టర్‌, వర్షపు నీరు వేగంగా వెళ్లేలా డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపర్చడం, నీరు నిల్వ కాకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన ముందస్తు చర్యలను చేట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. వరంగల్‌ ఆర్డీఓ సుమ, జీడబ్ల్యూఎంసీ ఈఈ సంజయ్‌, తహసీల్దార్‌ ఇక్బాల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement