‘సోషల్‌ వెల్ఫేర్‌’కు రూ.28 లక్షలు | - | Sakshi
Sakshi News home page

‘సోషల్‌ వెల్ఫేర్‌’కు రూ.28 లక్షలు

Jul 8 2026 1:20 AM | Updated on Jul 8 2026 1:20 AM

‘సోషల్‌ వెల్ఫేర్‌’కు రూ.28 లక్షలు

కాజీపేట అర్బన్‌: మడికొండలోని గర్ల్స్‌ సోషల్‌ వెల్ఫేర్‌ పాఠశాల, కళాశాల అభివృద్ధికి రూ.28 లక్షల నిధులతో పాటు తన వేతనం నుంచి రూ.2.50 లక్షలు విరాళంగా అందజేస్తున్నట్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌.నాగరాజు తెలిపారు. కాజీపేట మండలం మడికొండలోని గర్ల్స్‌ సోషల్‌ వెల్ఫేర్‌ పాఠశాల, కళాశాలను మంగళవారం కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, కుడా చైర్మన్‌ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ టి.వెంకన్న, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అజీజ్‌ఖాన్‌తో కలిసి పరిశీలించారు. ఇటీవల విద్యార్థిని కుక్క కాటుకు గురైన ఘటనను గోప్యంగా ఉంచిన ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ జ్యోతిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో లైటింగ్‌, 20 సీలింగ్‌ ఫ్యాన్ల ఏర్పాటుకు తన ఒక నెల వేతనం రూ.2.50 లక్షలు అందజేస్తున్నట్లు తెలిపారు. పాఠశాల ప్రహరీపై ఫెన్సింగ్‌ మున్సిపల్‌ శాఖ ద్వారా ఏర్పాటు చే యనున్నట్లు కలెక్టర్‌ చాహత్‌ తెలిపారు. గురుకుల విద్యా సంస్థ రీజినల్‌ కోఆర్డినేటర్‌ అరుణకుమారి, ఈడబ్ల్యూఐడీసీ కార్యనిర్వాహక ఇంజనీర్‌ నరేందర్‌రెడ్డి, ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి, తహసీల్దార్‌ రాజు ఉన్నారు.

ఇందిరమ్మ చీరల పంపిణీ..

మడికొండలోని శ్రీ రాజరాజేశ్వరి ఫంక్షన్‌ హాల్‌లో మంగళవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు 44, 45, 46, 64 డివిజన్ల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేశారు.

సీఎస్‌ను కలిసిన హనుమకొండ కలెక్టర్‌

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సంజయ్‌ జాజూను హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పూలమొక్క ఇచ్చారు.

‘సర్‌’ను పారదర్శకంగా పూర్తిచేయాలి

కాజీపేట రూరల్‌: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) కార్యక్రమాన్ని పారదర్శకంగా పూర్తిచేయాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ బూత్‌స్థాయి అఽధికారులను ఆదేశించారు. కాజీపేట పట్టణంలోని డీజిల్‌కాలనీ, విద్యానగర్‌ తదితర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి సర్‌ ప్రక్రియను పరిశీలించారు.

వేతనం నుంచి రూ. 2.50 లక్షలు

ఇస్తా: వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు

ప్రహరీకి రింగ్‌ చైన్‌ ఫెన్సింగ్‌ :

హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement