అర్ధంతరంగా సెంట్రల్‌ ల్యాబ్‌ బంద్‌ | - | Sakshi
Sakshi News home page

అర్ధంతరంగా సెంట్రల్‌ ల్యాబ్‌ బంద్‌

Jul 8 2026 1:20 AM | Updated on Jul 8 2026 1:20 AM

కాశిబుగ్గ: వరంగల్‌ మహాత్మాగాంధీ స్మాకర వైద్యశాలలో (ఎంజీఎం) క్రితం ఏర్పాటు చేసిన సెంట్రల్‌ ల్యాబ్‌ను అర్ధంతరంగా మూసివేయడంతో పేషెంట్లు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రిలోని 91/ఏ వ నంబర్‌లో ఆనాటి నుంచి పేషెంట్లకు సంబంధించిన రక్త పరీక్షలు చేస్తున్న ల్యాబ్‌ పూర్తిగా పనిచేయకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో నలుగురు ల్యాబ్‌ అటెండెంట్లు, ఇద్దరు ల్యాబ్‌ టెక్నీషియన్లు విధులు సేవలు అందించారు. ప్రస్తుతం ల్యాబ్‌ మూసివేయడంతో వీరిని ఇతర ల్యాబ్‌లకు పంపించారు.

ఆర్థోపెడిక్‌, సర్జరీ వార్డుల పేషెంట్ల ఇబ్బందులు

సాధారణంగా ఈ ల్యాబ్‌లో పనిచేసుస్తున్న సిబ్బంది దవాఖానాలోని సర్జికల్‌, మెడికల్‌, పిడీయాట్రిక్‌, ఆర్థోపెడిక్‌, ఈఎన్‌టీ, న్యూరో, కార్డియాలజీ, ఆర్‌ఐసీయూ, సీటీ తదితర వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులకు సంబంధించిన పరీక్షల కోసం వచ్చి బ్లడ్‌, యూరిన్‌ శాంపిల్‌ను తీసుకువెళ్తారు. వీరు సెంట్రల్‌ ల్యాబ్‌లో పరీక్షలు చేయించి, అదే రోజు రిపోర్టు అందిస్తారు. దీంతో వార్డుల్లో ఉన్న పేషంట్లు హెచ్‌బీ, హిమోగ్లోబిన్‌, బీటీ సీటీ పరీక్షల కోసం వార్డుల్లో పేషెంట్లకు వెసులుబాటు ఉండేది. నేరుగా బ్లడ్‌ శాంపిల్స్‌ టేకర్స్‌ వెళ్లి శాంపిల్స్‌ను తీసుకొచ్చే విధానం ఉండడంతో ఇన్‌ పేషెంట్లు ఊపిరిపీల్చుకునేవారు. ప్రస్తుతం వారు లేకపోవడంతో పేషెంట్లు నేరుగా ల్యాబ్‌కు పరీక్షల కోసం నడిచి రావాల్సి వస్తోంది. ముఖ్యంగా ఆర్థోపెడిక్‌, సర్జరీ వార్డుల్లో ఉన్న పేషెంట్ల బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. ఎంజీఎంలో ఉన్న మూడు ల్యాబ్‌ల్లో ఎక్కడికి వెళ్లాలో వీరికి తెలియడం లేదు. ఇన్‌ పేషెంట్‌గా ఉన్నవాళ్లు పరీక్షల కోసం ఎలా వెళ్తారని అటెండెంట్లు ప్రశ్నిస్తున్నారు. గతంలో మాదిరిగానే సెంట్రల్‌ ల్యాబ్‌ను నడిపిస్తూ ఇన్‌ పేషెంట్ల వెతలను తీర్చాలని వారు కోరుతున్నారు.

ఎంజీఎంలో ఇన్‌పేషెంట్లకు

తప్పని అవస్థలు

వార్డుల్లో అడ్రస్‌ లేని బ్లడ్‌ శాంపిల్‌ టేకర్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement