వరంగల్ క్రైం: పోలీసులు విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం ఎంతో కీలకమని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత అన్నారు. మూడు రోజుల పాటు జరిగే భద్రాద్రి జోనల్ పోలీస్ డ్యూటీ మీట్ పోటీలను మంగళవారం మామునూరు పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో ప్రారంభించారు. భద్రాద్రి జో నల్ పరిధిలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్, ఖమ్మం పోలీస్ కమిషనరేట్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం పోలీసు విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది డ్యూటీ మీట్‌లో పాల్గొన్నా రు. డ్యూటీ మీట్‌లో భాగంగా కంప్యూటర్ పరి జ్ఞానం, ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్ ప్రింట్ లిఫ్టింగ్, ప్యాకింగ్, హ్యాండ్లింగ్, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్, ఫొటోగ్రఫీ, వీడియో గ్రఫీ వంటి విభాగా ల్లో సిబ్బంది తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. ప్రతిభ కనబర్చిన వారిని త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్ కోసం ఎంపిక చేస్తామని ఆమె తెలిపారు. ఈ సంవత్సరం రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్ పోటీలు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, అదనపు డీసీపీలు బాలస్వామి, శ్రీనివాస్, జోనల్‌కు చెందిన ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు పాల్గొన్నారు.
విపత్తుల నుంచి ప్రజలను కాపాడాలి
మామునూరు: విపత్తుల నుంచి ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ప్రజలను కాపాడాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ఆదేశించారు. ఈమేరకు మంగళవారం మామునూరు టీజీ ఎస్పీ బెటాలియన్‌ను ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్‌తో కలిసి సీపీ సందర్శించారు. ప్రధాన గేట్ వద్ద సీపీ శ్వేతకు కమాండెంట్ శివప్రసాద్‌రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతించారు. అనంతరం పరిపాలన భవనం వద్ద స్పెషల్ పోలీసులు గౌరవందన సమర్పించారు. అత్యవసర సమయంలో ప్రజలను ఎలా కా పాడుతున్నారని ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని అడిగి తె లుసుకున్నారు. 2025 మోంథా తుపాను సమయంలో నాలుగో బెటాలియన్ ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది చే సిన సేవలను అభినందించారు. అనంతరం సిబ్బంది పరికరాలను పరిశీలించారు. ఏసీ ఈ.వీరన్న, రాజేందర్, ఎస్డీఆర్‌ఎఫ్ ఆర్‌ఐలు కార్తీక్, రవి, రాజ్‌కుమార్, అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు
వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత


